vizianagaram,amaravathi,woman,golden bangles

అమరావతి ఉద్యమానికి విజయనగరం మహిళ బాసట.. బంగారు గాజుల విరాళం!

తన చేతి గాజులను తీసి విరాళంగా ఇచ్చిన ప్రసన్నశ్రీ
ప్రభుత్వం మారడం భావితరాల దురదృష్టం
రాజధాని రావడం వల్ల విశాఖకు ఒరిగేదేమీ లేదు
విజయనగరం జిల్లాకు చెందిన ఎంవీ ప్రసన్నశ్రీ అనే మహిళ అమరావతి ఉద్యమానికి బాసటగా నిలిచారు. తన చేతికి ఉన్న గాజులను తీసి అమరావతి పరిరక్షణ జేఏసీకి విరాళంగా అందించి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు చంద్రబాబు చేసిన కృషి ఫలిస్తున్న సమయంలో ప్రభుత్వం మారడం భావితరాల దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలో తమకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నాయని, విశాఖకు రాజధాని రావడం వల్ల ప్రత్యేకంగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ప్రసన్నశ్రీ తేల్చి చెప్పారు.
Tags: vizianagaram,amaravathi,woman,golden bangles