వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా రూపొందిన 'వెంకీమామ' .. ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేఎస్ రవీంద్ర దర్శకత్వం

50 కోట్ల క్లబ్ దిశగా ‘వెంకీమామ’

  • ఈ నెల 13న వచ్చిన ‘వెంకీమామ’
  • మూడు రోజుల్లో 45 కోట్ల వసూళ్లు
  • ఖుషీ అవుతున్న వెంకీ అభిమానులు

వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా రూపొందిన ‘వెంకీమామ’ .. ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పటికి గట్టిపోటీ ఉండటంతో, ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ కథ, కామెడీ .. ఎమోషన్ .. యాక్షన్ .. సంగీతం .. గ్లామర్ పరంగా ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది .. అదే జోరుతో 50 కోట్ల క్లబ్ లోకి అవలీలగా చేరబోతోంది. ఈ మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 17.78 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా, ఒక్క నైజామ్ లోనే 6.72 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. ఈ సినిమాతో పాయల్ .. రాశి ఖన్నా ఖాతాలలోను హిట్ చేరిపోవడం వాళ్ల కెరియర్ కి మరింత హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు.
Tags: Venkatesh, Chaitu, Payal, Rasi Khanna, venky mama movie collection today