Varla Ramaiah,Telugudesam,Jagan,YSRCP,Jagananna Chedodu Scheme

సీఎం గారు.. ‘జగనన్న చేదోడు’ అంటే జగనన్న చేదువాడు అని అర్థం: వర్ల రామయ్య

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న చేదోడు’ పథకం పేరుపై టీడీపీ నేత వర్ల రామయ్య సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేస్తూ, ‘ముఖ్యమంత్రి గారు… మీ ప్రభుత్వం తెలుగును ఖూనీ చేస్తుందా? లేక మిమ్ముల్ని అల్లరి చేస్తుందా?’ అని ప్రశ్నించారు. చేదోడు అంటే సహాయం అనే కాకుండా, చేదువాడు అనే అర్థం కూడా వస్తుందని చెప్పారు. “జగనన్న చేదువాడు” అంటే చెడ్డవాడు అనే అర్థం కూడా వస్తుందని ఎద్దేవా చేశారు. ‘ఏమయ్యారు సార్, మీ తెలుగు ప్రపంచ మేధావులు? పేరు మార్చండి’ అని ట్వీట్ చేశారు.
Tags: Varla Ramaiah,Telugudesam,Jagan,YSRCP,Jagananna Chedodu Scheme