Trump arriving in Ahmedabad

అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్

అహ్మదాబాద్: యూఎస్ఏ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. నిన్న అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నుంచి ట్రంప్ తన కుటుంబ సభ్యులు, ప్రతినిధులతో ఏయిర్ పోర్స్ వన్ విమానంలో బయలుదేరిన విషయం తెలిసిందే.

విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. భారత త్రివిధ దళాలు ట్రంప్ దంపతులకు వందనం చేశాయి. గుజరాత్ సంప్రదాయ రీతిలో సాదరంగా స్వాగతించాయి. ట్రంప్ వెళ్లే కార్పెట్ కు ఇరువైపులా కళాకారులు నిల్చుని ఉన్నారు.