tollywood latest updates,nayanatara,koko koyela,f2 updates

బ్యాంకాక్ వెళుతున్న ‘ఎఫ్ 2’ యూనిట్

* తాజాగా ‘కోకో కోయిల’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన అందాల నయనతార ప్రస్తుతం సర్జున్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఐరా’ అనే టైటిల్ని తాజాగా నిర్ణయించారు. విశేషం ఏమిటంటే, ఇందులో ఆమె రెండు పాత్రల్ని పోషిస్తోంది.
* వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎఫ్ 2’ చిత్రం యూరప్ షెడ్యూలు పూర్తయింది. తదుపరి షెడ్యూలు షూటింగును బ్యాంకాక్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
* యంగ్ హీరో నితిన్ తన తాజా చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వంలో చేయనున్నాడు. ‘భీష్మ’ పేరుతో రూపొందే ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. డిసెంబర్ నుంచి షూటింగ్ జరుగుతుంది.
Tags: tollywood latest updates,nayanatara,koko koyela,f2 updates