home page

రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎప్పుడు అని ప్రశ్నిస్తున్న ప్రజలు ?

       పదకొండు వేల ఓట్లతేడాతో        మునుగోడులో మునిగిన బిజెపి  

 | 
Bjp
కోమటిరెడ్డీ… రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటున్నావ్
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ పరాభవంతో ఇప్పుడు అక్కడి బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటనపై చర్చ జరుగుతున్నది. సీనియర్ జర్నలిస్టు విజయ నిర్వహించే మిర్రర్ టివి ఛానెల్ తో మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లపై ఇప్పుడు చర్చ జరుగుతున్నది. మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ ఛానెల్ తో అన్నారు. ఆన్ రికార్డు చెబుతున్నారు… ఆలోచించుకుని చెప్పండి అని జర్నలిస్టు విజయ అన్నా కూడా తాను ఆ మాటకే కట్టుబడి ఉన్నానని కూడా రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం తో రాజగోపాల్ రెడ్డి రాజకీయ సన్యాసంపై ఎప్పుడు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీ పంచన చేరిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికను కొని తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడుగా రాజీనామా చేసి బీజేపీ తరపున ఆయన పోటీ చేశారు. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కష్ట సమయంలో వీడిపోయిన రాజగోపాల్ రెడ్డి చర్యను తెలంగాణ లోని కాంగ్రెస్ వాదులంతా తీవ్రంగా ఖండించారు. మునుగోడు అభివృద్ధి కోసమే తాను ఉప ఎన్నిక తీసుకువచ్చానని చెబుతున్న రాజగోపాల్ రెడ్డి జరిగిన ఎన్నికలో ఘోరంగా ఓడిపోయారు. ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఆయన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తను ఉన్న పార్టీకి ప్రత్యర్థి పార్టీ అయినా కూడా బీజేపీ గెలిచేందుకే సాయం చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీలు బద్ద శత్రువులే కానీ తన తమ్ముడు బీజేపీ నుంచి గెలవాలని ఆయన కోరుకున్నారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ దూరం చేయలేరని పదే పదే చెప్పే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడి కోసం కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన మోసం చేశారు. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ పరిస్థితి తెలంగాణ లో ఘోరంగా తయారవతుందనడంలో సందేహం లేదు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఓడిపోతే ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదవి పోతుందని, ఆ తర్వాత తానే పీసీసీ అధ్యక్షుడు అవుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. ఎన్నిక ముగియక ముందే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షోకాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఆయనకు నోటీసు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసి ద్రోహానికి సంబంధించిన అన్ని రుజువులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్దకు చేరాయి. దాంతో రేవంత్ రెడ్డి సంగతి అటుంచి కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి పదవికే ఎసరు వస్తున్నది. కాంగ్రెస్ పార్టీని ఇంత కాలం వాడుకుని ఇప్పుడు ఘోరంగా మోసం చేసిన కోమటిరెడ్డి బ్రెదర్స్ రాజకీయం ఇక చెల్లిపోయిందనే అనుకోవాలి.