వంద కోట్లతో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు !
అజీజ్నగర్ ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి

టీఆర్ఎస్ నాయకులు ధర్నా
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నం..పట్టుబడ్డ నలుగురు ఎమ్మెల్యేలు..!! pic.twitter.com/ERpbVI1r0U
— oneindiatelugu (@oneindiatelugu) October 26, 2022
ఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. బుధవారం రాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్ రెవెన్యూల్లో ఓ ఫాంహౌ్‌సలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రహస్యంగా భేటీ అయిన ఘటన దావనంలా వ్యాపించింది.
అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వల
నలుగురు ఎమ్మెల్యేలతో బేరం జరుపుతుండగా పోలీసుల ఎంట్రీ
మొయినాబాద్ ఫాంహౌస్‌లో బేరసారాలు
పక్కా సమాచారంతో సైబరాబాద్ పోలీసుల రైడ్:
టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. బుధవారం రాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్ రెవెన్యూల్లో ఓ ఫాంహౌ్‌సలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రహస్యంగా భేటీ అయిన ఘటన దావనంలా వ్యాపించింది. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని తాండూర్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఈ వ్యవహారం జరిగింది. వ్యవసాయ క్షేత్రంలో అధికార పార్టీకి చెందిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్, కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్‌రెడ్డి ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన స్వామీజీలు రామచంద్రభారతి, సోమయాజులు స్వామి, నందకుమార్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపారు. పోలీసులు పక్కా సమాచారంతో ఫాంహౌ్‌సపై ఒక్కసారిగా దాడి చేశారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో పోలీసుల బలగాలు భారీగా తరలివచ్చాయి. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డితోపాటు రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, సీఐ లక్ష్మీరెడ్డి, తదితరులు ఫాంహౌస్ చుట్టుముట్టారు. ఫాంహౌ్‌సలోకి ఇతరులను ఎవరినీ అనుమతించకుండా మధ్యవర్తులతో పాటు సంబంధిత ఎమ్మెల్యేలతో మాట్లాడారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పోలీసులు స్వామీజీలను ఫాంహౌ్‌సలో నిర్బంధించారు. కాగా ఎమ్మెల్యేలు గువ్వల బాల్‌రాజ్, కాంతారావు, హర్శవర్ధన్‌రెడ్డిలను ఓ ప్రైవేట్ వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. వారిని తరలించిన గంట తర్వాత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని మీడియా దృష్టి మరల్చి పోలీసు వాహనంలో నగరానికి పంపించారు. కాగా, నగదు ఎంత పట్టుబడిందనే విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే, ఫాంహౌ్‌సకు రూ.15 కోట్లు తీసుకువచ్చారని ప్రచారం ఊపందుకుంది. ఘటనా స్థలంలో నోట్లు లెక్కించేందుకు యంత్రాలు ఉండటంతో మరింత అనుమానానికి తావిచ్చింది. అర్ధరాత్రి పోలీసులు స్వామీజీలను విచారిస్తున్నారు. వీరిని రాజేంద్రనగర్ పీఎ్‌సకు తరలించాలా? లేక కమిషనరేట్‌కు తీసుకెళ్లాలా అనే విషయంలో పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ వ్యవహారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సొంత ఫాంహౌ్‌సలో జరగడంతో రంగారెడ్డి జిల్లాతోపాటు వికారాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. మధ్యవర్తిత్వం వహించిన నందకుమార్ సైతం వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామానికి చెందిన వాడు కావడంతో జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. నాలుగు రోజులుగా ఎమ్మెల్యేలు ఫాంహౌస్‌కు చక్కర్లు కొడుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా ఉదయం నుంచి ఇక్కడ మంతనాలు జరుపుతున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది.