home page

కోకాపేటలో ఎకరం వంద కోట్లు!

హెచ్ ఎమ్ డి ఏ కి భారీ లాభం!!

 | 
Neopolis
హైదరాబాద్‌లో రియల్ భూమ్ రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా ఎకరం 100 కోట్లు పలికింది అంటే డిమాండ్ ఏ మేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు.హైదరాబాద్ కోకాపేటలో రెండో విడత భూముల వేలానికి భారీ డిమాండ్ నెలకొంది.
నియోపొలిస్‌ లే అవుట్‌లోని 45.33 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఏడు ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయించారు.
జూలై 31 లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించగా ఈ ప్లాట్ సైజులు మూడు ఎకరాల నుంచి తొమ్మిది ఎకరాల వరకు ఉంటాయి. ఎకరానికి కనీస ధర రూ.35 కోట్లుగా నిర్ణయించగా తొలి విడతలో చేపట్టిన 6,7,8,9 ఫ్లాట్ల వేలం ముగియగా.. ఫ్లాట్లు అంచనాలకు మించి ధర పలికాయి.
ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.3319.60 కోట్ల ఆదాయం వచ్చింది. ప్లాట్ నెంబర్ 6 (7 ఎకరాలు)ను MSN ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఎకరానికి 73 కోట్ల చొప్పున మొత్తం 511 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.
ఇక అత్యధికంగా ఎకరానికి 100.75 కోట్లు పలకగా అత్యల్పంగా ఎకరా 67.25 కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్ 10(3.60 ఎకరాలను) ఒక ఎకరం 100.75 కోట్లకు మొత్తం 362.70 కోట్లకు హప్పి హైట్స్ నియోపొలిస్, రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది.
గతంలో 2021 జూలైలో నియోపోలిస్ ఫేజ్ 1 వేలంలో అత్యధికంగా ఎకరం ధర రూ. 60 కోట్లు రాగా ఇప్పుడు దానిని మించి ఆదాయం వచ్చింది.