shobha rani,telugudesam,amaravathi,divyavani

‘అమరావతి నా రాజధాని’ పేరుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్న శోభారాణి

అమరావతి రైతుల పోరాటానికి శోభారాణి మద్దతు
నటి దివ్యవాణితో కలిసి సినిమా నిర్మాణం
ఉద్యమ వాస్తవ ఘటనలతో రూపొందనున్న సినిమా
టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన హైకోర్టు న్యాయవాది చందోలు శోభారాణి, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత టీడీపీలో చేరారు. అయితే, ఆ తర్వాత కూడా ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చిన ఆమె.. ఏపీ పరిణామాలపై స్పందిస్తున్నారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారు.

తాజాగా, శోభారాణి ఓ కీలక ప్రకటన చేశారు. టీడీపీ నేత, సినీ నటి దివ్యవాణితో కలిసి ‘అమరావతి నా రాజధాని’ పేరుతో సినిమా నిర్మించనున్నట్టు తెలిపారు. ఉద్యమంలో జరుగుతున్న వాస్తవ ఘటనల ఆధారంగా నెల రోజుల్లోనే చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మండిపడ్డారు. రాజధాని రైతుల పోరాటానికి జగన్ తలవంచక తప్పదని శోభారాణి తేల్చి చెప్పారు.
Tags:shobha rani,telugudesam,amaravathi,divyavani