విచారణ గడువు ఒక్కరోజు కూడా పొడగించబోమన్న సుప్రీం

విచారణ గడువు ఒక్కరోజు కూడా పొడగించబోమన్న సుప్రీం

అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై విచారణను అక్టోబరు 18 నాటికి పూర్తి చేయాల్సిందేనని సుప్రీంకోర్టు మరోసారి తేల్చిచెప్పింది. ఆలోగా ఇరు పక్షాలు వాదనలు వినిపించాలని, అంతకు మించి ఒక్కరోజు కూడా అదనంగా ఇవ్వడం కుదరదని న్యాయస్థానం వెల్లడించింది.

అక్టోబరు 18 నాటికి వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు వెల్లడించడానికి ధర్మాసనానికి నాలుగు వారాల సమయం మాత్రమే ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగొయి తెలిపారు. ఆ నాలుగు వారాల్లో తీర్పు వెల్లడిస్తే న్యాయస్థానం అద్భుతం సాధించినట్లేనని అన్నారు.

Tags: sc, ayodhya, ramalayam, badri masjid, supreme court