సారిడాన్ ట్యాబ్లెట్ పై నిషేధం ఎత్తివేత!

గత వారం 328 కాంబినేషన్ డ్రగ్స్ ను సుప్రీంకోర్టు నిషేధించిన సంగతి తెలిసిందే. అసురక్షిత మాత్రల జాబితా కింద కేంద్ర ఆరోగ్య శాఖ ఈ 328 మందుల అమ్మకాలు, ఉత్పత్తిపై నిషేధం విధించింది. వీటిలో పెయిన్ కిల్లర్ సారిడాన్ కూడా ఉంది. అయితే, ఆ జాబితాలో ఉన్న సారిడాన్ తో పాటు మరో రెండు మాత్రలపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తివేసింది. సారిడాన్ ను మార్కెట్లో అమ్ముకోవచ్చంటూ ఈరోజు తీర్పును వెలువరించింది. మన దేశంలో తలనొప్పికి సారిడాన్ ట్యాబ్లెట్ చాలా ఫేమస్. కొన్ని దశాబ్దాలుగా ఈ మాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

Tags: saridon, ban,supreme court ,328 combination , drug