RRR,rajamouli,mahesh babu,prabhas

మహేశ్, ప్రభాస్ హీరోలుగా రాజమౌళి తదుపరి చిత్రం!

ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉన్న రాజమౌళి, తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టేశాడని, ‘బాహుబలి’ని మించేలా ఉండే ఈ భారీ పీరియాడికల్ చిత్రంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి నటిస్తారని టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నా, వీరి ముగ్గురి పేర్లూ వినగానే, ఫ్యాన్స్ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.

తన కెరీర్ లో పరాజయాన్ని ఎరుగని రాజమౌళి, వచ్చే సంవత్సరం వరకూ ‘ఆర్ఆర్ఆర్’తో బిజీ. ఆ తరువాతే తదుపరి చిత్రం గురించి ఆయన ఆలోచిస్తారనడంలో సందేహం లేవు. వాస్తవానికి మహేశ్ తో రాజమౌళి సినిమా ఎప్పుడో రావాల్సింది. కేఎల్ నారాయణ నిర్మాతగా ఓ చిత్రాన్ని రాజమౌళి అంగీకరించారు కూడా. రాజమౌళి తరువాతి సినిమా ఇదేనని, ఇదే చిత్రంలో ప్రభాస్ కూడా ఉంటారని, యూవీ క్రియేషన్స్ బ్యానర్ కూడా నిర్మాతగా ఉంటుందని చాలా వార్తలు వినిపిస్తున్నాయి. మరిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.
Tags: RRR,rajamouli,mahesh babu,prabhas