ramya krishna, eswar, astrology, bhanumathi

చెయ్యి చూసి జాతకం చెప్పడంలో రమ్యకృష్ణ సిద్ధహస్తురాలట!

అప్పట్లో భానుమతి జాతకాలు బాగా చెప్పేవారు
ఆ తరువాత ఆ స్థానం రమ్యకృష్ణదే అనిపించింది
నా చేయి చూసి కరెక్ట్ గా చెప్పిందన్న ఈశ్వర్
తెలుగు తెరపై నిన్నటితరం గ్లామరస్ హీరోయిన్ గా రమ్యకృష్ణ ఒక వెలుగు వెలిగారు. ఇటీవల కాలంలో తన వయసుకి తగిన కీలకమైన పాత్రలను చేస్తూ, తన క్రేజ్ ఎంత మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. అలాంటి రమ్యకృష్ణను గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.

“అప్పట్లో తెలుగు చిత్రపరిశ్రమలో చెయ్యి చూసి జాతకం చెప్పడం ఒక్క భానుమతిగారికే తెలుసు. అలా జాతకాలు చెప్పడంలో రమ్యకృష్ణ సిద్ధహస్తురాలనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ సంగతి నాకు తెలిసి ఆమెను పరీక్షించడం కోసం, నాకు పెళ్లి ఎప్పుడు అవుతుందో .. ఎంతమంది పిల్లలో చెప్పమని రమ్యకృష్ణను అడిగాను. ఆమె నా చేయి చూసి “మీరు నన్ను పరీక్షించడం కోసం అడిగి వుంటారు .. మీ రేఖలు చూస్తుంటే ఈ పాటికే మీకు పెళ్లి అయిపోయి,ముగ్గురు పిల్లలు ఉండి ఉండాలి” అన్నారు. అది నిజమే కావడంతో నేను షాక్ అయ్యాను. జాతకాలు చెప్పడంలో ఆమె దిట్ట అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది” అని అన్నారు.
Tags: ramya krishna, eswar, astrology, bhanumathi