అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ నుంచి కాపు రామచంద్రారెడ్డి పోటీలో ఉండగా, ప్రజాశాంతి పార్టీ తరఫున ఉండాల రామచంద్రారెడ్డి బరిలోకి దిగారు. అనంతపురం అర్బన్ నుంచి అనంత వెంకటరామిరెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తుండగా, ప్రజారాజ్యం పగిడి వెంకరామిరెడ్డి అనే వ్యక్తిని బరిలోకి దింపింది. ఈ రెండే కాదు. మరో 6 నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థుల పేర్లతో సరిపోయే పేర్లున్న వారిని ఎంపిక చేసుకుంది. ప్రజాశాంతి పార్టీ నాయకుడు కేఏ పాల్ ఇలా చేయడం వెనుక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈవీఎంలలో పేరులోని తొలి ఆంగ్ల అక్షర క్రమానుసారం వరుస సంఖ్య ఉంటుంది కాబట్టి ఓటర్లను అయోమయంలో పడేసే కుట్ర జరుగుతోందని మండిపడుతున్నారు. ఫ్యాన్ గుర్తుకు పైనో, కిందో హెలికాప్టర్ ఉండేలా చూస్తున్నారని, దీంతో నిరక్షరాస్యులైన ఓటర్లు పొరపాటు పడే ప్రమాదం ఉందని అంటున్నారు. కాగా, ఉరవకొండలో వైసీపీ తరఫున విశ్వేశ్వర్ రెడ్డి పోటీలో ఉండగా, విశ్వనాథ్ రెడ్డి అనే అతను ప్రజాశాంతి తరఫున నామినేషన్ వేశాడు. కల్యాణదుర్గంలో వైసీపీ ఉషా శ్రీచరణ్ ను నిలిపితే, ఉషారాణి అనే మహిళ ప్రజాశాంతి నుంచి బరిలో ఉన్నారు. రాప్తాడులో వైసీపీ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇవ్వగా, ప్రజాశాంతి నుంచి డీ ప్రతాప్ బరిలో ఉన్నారు. పెనుగొండలో వైసీపీ తరఫున ఎం శంకర్ నారాయణ, ప్రజాశాంతి తరఫున ఎస్ శంకర్ నారాయణ పోటీపడుతుండగా, ధర్మవరంలో వైసీపీ తరఫున కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ప్రజాశాంతి తరఫున పెద్దిరెడ్డిగారి వెంకటరామిరెడ్డి బరిలో ఉన్నారు. ప్రజాశాంతి అభ్యర్థుల వెనుక చంద్రబాబు దొడ్డిదారి వ్యూహం ఉందని, ఆయన డైరెక్షన్ లోనే కేఏ పాల్ ఎన్నికల యాక్షన్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటర్లను గందరగోళ పరిచేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు. Tags: prajasanthi party, KA paul, chandrababu naidu, ysrcp party

వైసీపీని దెబ్బకొట్టేందుకు… ఒకేరకమైన పేర్లతో నామినేషన్లు వేయించిన ‘ప్రజాశాంతి’ కేఏ పాల్!

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ నుంచి కాపు రామచంద్రారెడ్డి పోటీలో ఉండగా, ప్రజాశాంతి పార్టీ తరఫున ఉండాల రామచంద్రారెడ్డి బరిలోకి దిగారు. అనంతపురం అర్బన్ నుంచి అనంత వెంకటరామిరెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తుండగా, ప్రజారాజ్యం పగిడి వెంకరామిరెడ్డి అనే వ్యక్తిని బరిలోకి దింపింది.

ఈ రెండే కాదు. మరో 6 నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థుల పేర్లతో సరిపోయే పేర్లున్న వారిని ఎంపిక చేసుకుంది.
ప్రజాశాంతి పార్టీ నాయకుడు కేఏ పాల్ ఇలా చేయడం వెనుక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈవీఎంలలో పేరులోని తొలి ఆంగ్ల అక్షర క్రమానుసారం వరుస సంఖ్య ఉంటుంది కాబట్టి ఓటర్లను అయోమయంలో పడేసే కుట్ర జరుగుతోందని మండిపడుతున్నారు. ఫ్యాన్ గుర్తుకు పైనో, కిందో హెలికాప్టర్ ఉండేలా చూస్తున్నారని, దీంతో నిరక్షరాస్యులైన ఓటర్లు పొరపాటు పడే ప్రమాదం ఉందని అంటున్నారు.

కాగా, ఉరవకొండలో వైసీపీ తరఫున విశ్వేశ్వర్ రెడ్డి పోటీలో ఉండగా, విశ్వనాథ్ రెడ్డి అనే అతను ప్రజాశాంతి తరఫున నామినేషన్ వేశాడు. కల్యాణదుర్గంలో వైసీపీ ఉషా శ్రీచరణ్ ను నిలిపితే, ఉషారాణి అనే మహిళ ప్రజాశాంతి నుంచి బరిలో ఉన్నారు. రాప్తాడులో వైసీపీ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇవ్వగా, ప్రజాశాంతి నుంచి డీ ప్రతాప్ బరిలో ఉన్నారు. పెనుగొండలో వైసీపీ తరఫున ఎం శంకర్ నారాయణ, ప్రజాశాంతి తరఫున ఎస్ శంకర్ నారాయణ పోటీపడుతుండగా, ధర్మవరంలో వైసీపీ తరఫున కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ప్రజాశాంతి తరఫున పెద్దిరెడ్డిగారి వెంకటరామిరెడ్డి బరిలో ఉన్నారు.

ప్రజాశాంతి అభ్యర్థుల వెనుక చంద్రబాబు దొడ్డిదారి వ్యూహం ఉందని, ఆయన డైరెక్షన్ లోనే కేఏ పాల్ ఎన్నికల యాక్షన్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటర్లను గందరగోళ పరిచేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు. Sakshi Live Tv
Tags: prajasanthi party, KA paul, chandrababu naidu, ysrcp party