home page

పొత్తులపై పవన్ క్లారిటీ!

వైసీపీ ఓటమి కి విశ్వప్రయత్నం 

 | 
Pawan kalyana

తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. కచ్చితంగా పొత్తులతోనే ముందుకు సాగుతామని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వబోమని... ఇందుకోసం కొంతమందిని ఒప్పిస్తామని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తామని అన్నారు.

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన ఆయన. రైతుల సమస్యలు పై స్పందించి న్యాయం చేయడం ఈ ప్రభుత్వానికి చేతకాదన్నారు పవన్ కల్యాణ్. "నేను మేధావిని కాదు... నిపుణుడిని కాదు. నాకు పది రకాల పంటలు తెలియదు. కానీ రైతు లకు అండగా ఉండటం మా బాధ్యత. అన్నీ తెలుసు అనుకుంటున్న మంత్రులు, సిఎం రైతు కు న్యాయం చేయాలి కదా..? మమ్మల్ని విమర్శించే వారు ముందు రైతు సంక్షేమం గురించి ఆలోచన చేయాలి. నేను అందరినీ కలుపుకు వెళ్లే విధానంలో ఉన్నా. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న దానికి కట్టుబడి ఉన్నా. భవిష్యత్తు లో ఎవరెవరు ఎలా కలుస్తామో చూడాలి. పొత్తలకు సంబంధించి ఆయా పార్టీ ల విధానాలు బట్టి ఉంటుంది. ప్రతి పార్టీ కి కొంత ఓటు శాతం ఉంటుంది... వాటిని బట్టి అడుగులు ఉంటాయి. వైసీపీ దుర్మార్గపు పాలన వల్లే వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నాను. నేను నా ఉనికి కోసం రాజకీయ పార్టీ పెట్టలేదు. అసెంబ్లీ లో బలమైన సమూహాన్ని పంపాలనేది చూస్తాం. 2014 లో కూడా అన్నీ ఆలోచన చేసే బిజెపి, టిడిపి కి మద్దతు ఇచ్చాం. అందరికీ అన్నివిషయాలు తెలియవు... తెలుసుకునే ఆసక్తి ఉండాలి. మంత్రులు కూడా ఈ వాస్తవాలు తెలుసుకోవాలి. అవగాహన లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు పొత్తుల పై మళ్లీచెబుతున్నా... వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలనివ్వను" అని పవన్ స్పష్టం చేశారు.

2019 ఎన్నికల్లో 137 మంది అభ్యర్థులు ను పోటీకి పెట్టగలిగామని గుర్తు చేశారు జనసేనాని పవన్. వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే... ప్రజలను ఇబ్బందులు పెడుతుంటే చూస్తూ కూర్చుంటామా అని ప్రశ్నించారు. "నేను పొత్తులు పెట్టుకుంటాను... బిజెపి కి ఇదే చెప్పాను. టిడిపి తో పొత్తు పై కూడా జనసేన సొంతంగా వెళ్లాలి.. నేను సిఎం అన్నారు. 2019 లో మాకు 30-40 స్థానాలు ఇచ్చి ఉంటే మేము బలంగా పోరాటం చేసే వాళ్లం. నేను సిఎం గా ఉండాలంటే కనీసం స్థానాలు ఉంటే మాట్లాడవచ్చు. నేను ఒక కులం కోసం పనిచేయడం లేదు... రాష్ట్రం కోసం పని చేస్తున్నా. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటే జూన్ నుంచే ఇక్కడే ఉంటాను. అందరూ కలిసి వస్తే... మా అభిప్రాయాలను గౌరవించే పార్టీ ల పొత్తుతో వెళతాం. ఈసారి వైసీపీ దాష్టికాలను అడ్డుకుని సాగనంపుతాం. మాకు బలం ఉన్న చోట మాత్రం తప్పకుండా మెజారిటీ స్థానాలు తీసుకుంటాం. రాష్ట్ర భవిష్యత్తు బలోపేతం, వైసిపి నుంచి రాష్ట్రాన్ని రక్షించడం నా బాధ్యత. సిఎం పదవి మనల్ని వరించాలి కానీ, వాటి కోసం పాలకులాడే వ్యక్తిత్వం నాది కాదు. వాళ్లకోసం, వీళ్లకోసం పవన్ పని చేస్తాడనే వాదన వదిలేయండి. గెలిపించే బాధ్యత తీసుకోకుండా ఉచిత సలహాలు ఇవ్వకండి. నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం... అందుకు ఎటువంటి నిర్ణయం అయినా తీసుకుంటాను" అంటూ పవన్ కామెంట్స్ చేశారు.

అయితే ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే సీఎం పదవి ఎవరికి ఇస్తారనే చర్చ ఉండేది. ఈ అంశం ఇరు పార్టీల మధ్య కాస్త గ్యాప్ పెంచేందుకు కూడా కారణమైందన్న చర్చ ఉంది. అయితే ఇవాళ మాట్లాడిన పవన్... పరోక్షంగా తాను సీఎం అభ్యర్థిత్వం కోరబోననే విషయాన్ని చెప్పకనే చెప్పేశారన్నట్లుగా ఉంది. పవన్ కల్యాణ్ చేసిన ఈ కామెంట్స్ తో ఏపీ పాలిటిక్స్ లో మరింత హీట్ పెరగటం ఖాయంగా కనపిస్తోంది.