home page

లావాసాలో మోదీ విగ్రహం తయారవుతోంది !

దేశంలో తారా స్థాయికి చేరిన వ్యక్తి పూజ !!

 | 
Modi
 ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. పుణెకి సమీపంలో నిర్మిస్తున్న తొలి ప్రైవేట్‌ నగరం లావాసాలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
డార్విన్‌ ప్లాట్‌ఫామ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనే ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహాన్ని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుందీ సందస్థ. 2023 డిసెంబర్‌ 31 నాటికి విగ్రహానికి పూర్తి చేయనున్నారు. భారతదేశ ఐక్యత, సమగ్రతను కాపాడడం కోసం దృఢమైన అంకితభావంతో పనిచేస్తున్న నరేంద్ర మోదీ కృష్టికి చిహ్నంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డార్విన్‌ ప్లాట్‌ఫామ్‌ సీఎమ్‌డీ అజయ్‌ హరినాథ్‌ సింగ్ తెలిపారు. ఈ విషయమై అజయ్‌ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ మన దేశ ఐక్య, సమగ్రతను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. దేశానికి మోదీ చేస్తున్న కృషికి ఈ విగ్రహం చిహ్నం అవుతుంది’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఈ విగ్రహం గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ కంటే పెద్దదిగా ఉండనుందని సమాచారం. మోదీ విగ్రహాన్ని ఏకంగా 190 నుంచి 200 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నట్లు సమాచారం. ఈ విగ్రహంతో పాటు భారత దేశ వారసత్వంతో పాటు న్యూ ఇండియా ఆకాంక్షలను ప్రదర్శించే మ్యూజియం, ఉద్యానవనం, ఎగ్జిబిషన్ హాల్‌ వంటి నిర్మాణాలను చేపట్టనున్నారు. ఎగ్జిబిషన్‌ హాల్‌లో ప్రధాని జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.
ఇక లావాసా పట్టణ నిర్మాణానికి సంబంధించి డార్విన్ ప్లాట్‌ఫామ్ సంస్థకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ నుంచి ఆమోదం లభించింది. జూలైలో లావాసా కార్పొరేషన్ లిమిటెడ్‌కు సంబంధించి డార్విన్‌ ప్లాట్ ఫామ్‌ లిమిటెడ్‌ బిడ్‌ను దక్కించుకుంది. పుణెకు సమీపంలో లావాసా ప్రైవేట్ మిల్‌ స్టేషన్‌లో పట్టణాన్ని నిర్మిస్తున్నారు. డీపీఐఎల్‌ సంస్థను 2010లో అజయ్‌ హరినాథ్‌ సింగ్ ఏర్పాటు చేశారు. డీపీఐఎల్‌ ప్రస్తుతం రిటైల్‌, ఆతిథ్యం, రిఫైనరీ వంటి పలు రంగాల్లో సేవలు అందిస్తోంది.