home page

బీజేపీలోకి మరో ట్విస్ట్

కోమటిరెడ్డికి జాతీయ స్థాయిలో పదవి 

 | 
Bjp
*బీజేపీలో మరో బిగ్‌ ట్విస్ట్‌.. కోమటిరెడ్డికి జాతీయ పదవి*
ఢిల్లీ: తెలంగాణలో బీజేపీలో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన బీజేపీ అధిష్టానం మరో నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కీలక పదవి ఇచ్చింది.
కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాల మేరకు బుధవారం పార్టీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కోమటిరెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తోందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో, ఇకపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా వ్యవహరించున్నారు.
ఇదిలా ఉండగా.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడంతో ఒక్కసారిగా తెలంగాణలో కూడా పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ను వీడిన నేతలు ఒక్కొక్కరుగా మళ్లీ హస్తం గూటికి చేరుతున్న విషయం తెలిసిందే. అయితే, రాజగోపాల్‌రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు వినిపించాయి. దీనిపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాకుండా, రాజగోపాల్‌ కూడా కొంత కాలంగా బీజేపీ హైకమాండ్‌పై సీరియస్‌గా వ్యవహరించడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వంటి చేయడంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక, ఇటీవల కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పుల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్‌ అలర్ట్‌ అయ్యింది. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి వెళ్లిపోకుండా ఇలా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది.అంతకుమందు.. పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ బీజేపీలో పార్టీ అధిష్టానం కీలక మార్పులు చేసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్‌ను తొలగించి.. స్టేట్ చీఫ్ బాధ్యతలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అప్పగించింది. అంతేకాకుండా, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే.