తేలనున్న బండి భవిత?
పార్టీ లో ప్రభావం ఎక్కువ ఉంటుంది : పరిశీలకులు
*ప్రారంభమైన బీజేపీ కీలక సమావేశం.. తేలనున్న బండి సంజయ్ భవితవ్యం*
న్యూ ఢిల్లీ :జులై 01
బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం ప్రారంభమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జులు, మోర్చాల అధ్యక్షులు, మోర్చాల ఇన్చార్జులు హాజరయ్యారు. సమావేశంలో బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ బిఎల్ సంతోష్ పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లో సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. మోదీ ప్రభుత్వ పాలన తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన మహాజన సంపర్క్ అభియాన్, ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమాల వివరాలను అధిష్టానానికి నేతలు సమర్పించున్నున్నారు.
ఎన్నికలు జరగనున్న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలో పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు ధఫాలుగా సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. మొదటగా జాతీయ ప్రధాన కార్యదర్శులతో తర్వాత మోర్చాల అధ్యక్షులతో పార్టీ పరిస్థితులపై అధిష్టానం చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సమావేశం పూర్తైతే కానీ తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బండి సంజయ్‌ను కొనసాగిస్తారా? లేదా? అనేది తేలే అవకాశం ఉంది....