యూనివర్సిటీ ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్ తొలగింపు
ఆర్డినెన్స్ జారీ చేసిన కేరళ ప్రభుత్వం
గవర్నర్ కు కేరళ సర్కార్ కు మధ్య ముదిరిన వివాదం !
*కేరళ*
_*గవర్నర్ను ఛాన్స్లర్ పదవి నుంచి తొలగిస్తూ కేరళ సర్కార్ ఆర్డినెన్స్*_
★ కేరళ ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య వివాదం మరింత ముదురుతోంది.
★ తాజాగా గవర్నర్కు షాకిస్తూ.. సీఎం పినరయి విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
★ కలమండలం డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్స్లర్ పదవి నుంచి గవర్నర్ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
★ యూనివర్సిటీ నిబంధనలను మారుస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
★ ఆ స్థానంలో కళలు, సాంస్కృతి రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తిని నియమించనున్నట్లు పేర్కొంది.
★ రాష్ట్రంలో యూనివర్సిటీల ఛాన్స్లర్గా గవర్నర్ను తొలగించడానికి ఓ ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
★ ఈ పదవిలో ఆయన కొనసాగాలని తాము భావించడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
★ ముఖ్యంగా 9 యూనివర్సిటీల వీసీలను తొలగించాలని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ నిర్ణయించగా..దాన్ని ప్రభుత్వం వ్యతిరేకించింది.
★ గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీసీలు కూడా హైకోర్టును ఆశ్రయించారు.
★ దీంతో గవర్నర్, ప్రభుత్వం మధ్య వివాదం పెరుగుతూ వస్తోంది.