పవార్ రాజకీయ ప్రస్థానం
May 2, 2023, 17:26 IST
| దేశంలో రాజ్యాంగ పదవి నిర్వహించే శక్తిసామర్ధ్యలు పుష్కళంగా ఉన్నప్పటికీ ఉన్నత శిఖరాలను చేరకుండానే రాజకీయ ప్రస్థానానికి ముగింపు పైకిన ఏకైక రాజకీయనాయకుడు శరద్ పవార్. 27 ఏళ్ళ వయస్సు లో ఎమ్మెల్యే గా ఎన్నికై 38 ఏళ్ళ వయస్సులోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మహారాష్ట్ర ఉక్కుమనిషిగా పేరు పొందిన శరద్ పవార్ 82ఏళ్ళ వయస్సులో 24 ఏళ్ళ పాటు నిర్వహించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షులు సోనియాగాంధీ తో విభేదించి సొంతం గా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన శరద్ పవార్ దేశంలో రాజకీయాలలో ముఖ్యంగా మహా రాష్ట్ర రాజకీయాలలో తన ముద్ర వేశారు.