'సుప్రీం ఆదేశాలు ఉల్లంఘించలేం'
జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు
Oct 14, 2022, 17:14 IST
| లక్నో : జ్ఞానవాపి మసీదులోని శివలింగంపై కార్బన్ డేటింగ్ సెర్చ్ జరపాలన్న హిందూ వర్గ వాదనని వారణాసి కోర్టు తోసిపుచ్చింది.వారణాసిలోని మసీదులో బయటపడిన శివలింగం వయస్సు నిర్థారణ కోసం కార్బన్ డేటింగ్ చేయాలంటూ హిందూ వర్గానికి చెందిన ఐదుగురు మహిళలు కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్‌పై వారణాసి కోర్టు నేడు విచారణ చేపట్టింది. కార్బన్ డేటింగ్ చేపట్టడమంటే ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని కోర్టు పేర్కొంది. అలాగే ఆ నిర్మాణానికి హాని కలిగించేలా ఎలాంటి చర్యలు చేపట్టకూడదని, శివలింగానికి భద్రత కలిగించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిందని .. వాటిని ఉల్లంఘించేలా ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు పేర్కొంది.