home page

మెయిన్ పురి డింపుల్ యాదవ్ దే!

 | 
దింపుల్
న్యూఢిల్లీ,: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంతో ఖాళీ అయిన మైన్‌పురి లోక్‌సభ స్థానాన్ని ఆ పార్టీ కాపాడుకొన్నది. ఆ స్థానం నుంచి ఉప ఎన్నికలో బరిలోకి దిగిన ములాయం కోడలు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌ బంపర్‌ మెజారిటీ దక్కించుకొన్నారు. బీజేపీకి చెందిన రఘురాజ్‌సింగ్‌ శక్యాపై 2,88,461 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. యూపీలోని రాంపూర్‌ సదర్‌ (ఎస్పీ సిట్టింగ్‌ స్థానం) అసెంబ్లీ సీటు, బీహార్‌లోని కుర్హానీ సీటును (ఆర్జేడీ సిట్టింగ్‌ స్థానం) బీజేపీ దక్కించుకొన్నది.

కానీ, యూపీలోని ఖతౌలీ సీటును ఆరెల్డీకి సమర్పించుకొన్నది. అటు.. కాంగ్రెస్‌ తన రెండు స్థానాలను పదిలపర్చుకొన్నది. ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్‌, రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్‌ నుంచి ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. ఒడిశాలో పదంపూర్‌ స్థానాన్ని అధికార బీజేడీ నిలబెట్టుకుంది.