home page

కరెన్సీపై 'గాడ్ ,ఫాదర్ ' కేజ్రీవాల్ సూచన !

'రూపాయి నోటుపై లక్ష్మీ గణేష్ బొమ్మలు  వేయాలి  '

 | 
currency notes GodcFathers

rvind kejriwal: చాలా కాలంగా భారత ఆర్థిక వ్యవస్థకు రూపాయి పతనం పెద్ద సవాలుగా మారింది. అయితే దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ఇది రూపాయి పతనం కాదు డాలర్ బలం అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.
అయితే తాజాగా ఇదే విషయంపై ఢిల్లీ సీఎం చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారటంతో పాటు వివాదానికి దారితీస్తోంది.


అరవింద్ కేజ్రీవాల్..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా రూపాయి పతనంపై తనదైన శైలిలో కామెంట్ చేశారు. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు గణేశుడు, లక్ష్మీ దేవి ఫోటోలను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరెన్సీలపై దేవుళ్ల ఫొటోలు పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటంతో పాటు దేశ ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని చెప్పారు.

ఈ దేవతలే ఎందుకు..?
 
రూపాయి విలువ నిరంతరం పడిపోవడంతో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందంటూ కేజ్రీవాల్ ప్రసంగం ప్రారంభించారు. కరెన్సీ నోట్లపై భగవంతుని చిత్రాలు ఉంటే దేశం మొత్తం వారి ఆశీర్వాదం పొందుతుందన్నారు. లక్ష్మీ శ్రేయస్సుకు దేవత, గణేశుడు కష్టాలను దూరం చేసే దేవుడు అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా..
 

ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు స్కూల్స్, హాస్పిటల్స్, మౌలిక సదుపాయాలు వంటివి నిర్మిస్తున్నట్లు కేజ్రీ చెప్పారు. అయితే కొన్ని సార్లు ప్రయత్నాలకు ఫలితం ఉందని.. అందుకు దేవుని ఆశీస్సులు కూడా అవసరమంటూ చెప్పారు. కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్ల విషయంలో ఈ ప్రతిపాదనను అమలు చేయాలన్నారు.

ఇండోనేషియా..

దీనికి ఉదాహరణగా ఇండోనేషియా గురించి చెప్పిన కేజ్రీవాల్.. అక్కడ మెుత్తం జనాభాలో కేవలం 2 శాతం కంటే తక్కువ మందే హిందువులు ఉన్నారని అన్నారు. కానీ ఆదేశ కరెన్సీ నోట్లపై గణేశుడి ఫోటో ముద్రించిన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలోనూ కేంద్ర ప్రభుత్వం తీసుకోవలసిన గొప్ప చర్యగా తాను భావిస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు.

బీజేపీ నేతల ఆగ్రహం..
 

ఢిల్లీ ముఖ్యమంత్రి సూచనపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. "ఔరంగజేబ్ ఇమేజ్"ని డ్యామేజ్ చేసేందుకే ఇలాంటి కామెంట్స్ చేశారంటూ బీజేపీ బిజెపి నేత తేజిందర్ పాల్ బగ్గా   అంటున్నారు. యమునా నదిని కూడా కేజ్రీవాల్ శుభ్రం చేయలేదంటూ ఆయన మండిపడ్డారు  . హిందువు బిడ్డలను జైలుకు పంపాలని కేజ్రీవాల్ ప్రయత్నించారని ఆయన సీరియస్ అయ్యారు  . మరో బీజేపీ నేత నళిన్ కోహ్లి మాట్లాడుతూ రాజకీయ మైలేజీ కోసమే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.