home page

హేమంత్ సోరెన్ కు ఈడీ సమన్లు

3 న హాజరు కావాలని నోటీసు  

 | 
Soren
రాంచి  :   మైనింగ్‌ లీజులకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు ఇడి సమన్లు జారీ చేసింది. నవంబర్‌ 3న రాంచిలోని ఇడి కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి రాజకీయ ప్రతినిధి పంకజ్‌ మిశ్రా సహా మరో ఇద్దరు అరెస్టయ్యారు.ఈ ఏడాది జులైలో ఇడి రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో మిశ్రా నివాసం అనేక స్టోన్‌ క్రషర్లు, ట్రక్కులతో పాటు రూ.5.34 కోట్ల నగదు , 50 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.13.32 కోట్లు , రూ. 30 కోట్ల విలువైన నౌకను స్వాధీనం చేసుకుంది. సోరెన్‌ నియోజకవర్గమైన బర్హైత్‌లో మైనింగ్‌ వ్యాపారాన్ని మిశ్రా నియంత్రిస్తున్నారని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి మరిన్ని కేసులు దీని పరిధిలోకి వచ్చాయని.. ఇప్పటివరకు రూ. 100 కోట్లకు పైగా అక్రమ ఆదాయాన్ని గుర్తించినట్లు ఇడి పేర్కొంది.