home page

జమ్మూకాశ్మీర్ విలీనమై 75 సంవత్సరాలు

 | 

 జమ్మూ- కశ్మీర్‌ ఇండియాలో విలీనం అయి నేటికి అక్టోబర్ ఇరవై ఏడు నాటికి   75 సంవత్సరాలు పూర్తయ్యాయి. రెండోది నెహ్రూ చేసిన అతి పెద్ద తప్పిదాలకు అక్టోబర్‌ 27న 75వ వార్షికోత్సవం. అప్పుడు నెహ్రూ తీసుకొన్న నిర్ణయాలు భారతదేశాన్ని ఏడు దశాబ్దాలుగా వెంటాడాయి. 1947లో భారతదేశం విభజన జరిగినప్పుడు, విభజన సూత్రం బ్రిటిష్ ఇండియాకు మాత్రమే వర్తిస్తుంది. రాచరిక పాలనలోని ప్రాంతాలు భారతదేశం, పాకిస్థాన్‌లలో దేన్నైనా ఎంచుకోవచ్చు. ఆయా రాజ్యాలలోని ప్రజలతో ఎలాంటి సంప్రదింపులు జరపాలనే నిబంధన లేదు. విలీనానికి సంబంధించిన అన్ని విషయాలు సంస్థానాధీశుల పాలకులకు, ఆయా రాజ్యాల నాయకులు నిర్ణయిస్తారు.

అన్ని రాజ్యాలను ఇండియాలో కలిపేందుకు సర్దార్ పటేల్‌ కృషి చేశారు. 1947 ఆగస్టు 15కి ముందు దాదాపు 560 రాజ్యాలను భారతదేశంలో విలీనం చేశారు. అప్పుడు హైదరాబాద్ , జునాఘర్ సంస్థానాలు సమస్యలను సృష్టించాయి. అయితే సర్దార్ పటేల్ రెండు రాజ్యాలను దారికి తీసుకురావడంలో విజయవంతం అయ్యారు. అయితే కశ్మీర్‌ విలీనం అంశంలో అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు చెప్పారు. న్యూస్ 18 సంపాదకీయంలో ఆయన విశ్లేషణ ఇదే..

ఆ జాబితాలో కశ్మీర్‌

సమస్యలను సృష్టించిన రాజ్యాలలో కశ్మీర్‌ కూడా ఉందని, అప్పటి రాష్ట్ర పాలకుడైన మహారాజా హరిసింగ్ భారతదేశంలో చేరాలని ఉవ్విళ్లూరుతున్నాడని ఏడు దశాబ్దాలుగా చారిత్రక అబద్ధం ప్రచారంలో ఉంది. ఇప్పుడు లభించిన పత్రాల ఆధారంగా నెహ్రూ తన వ్యక్తిగత ఎజెండాను నెరవేర్చుకోవడానికి, ఈ సమస్యలను సృష్టించారని, మహారాజు కాదని తెలిసింది. 1952 జులై 24న లోక్‌సభలో చేసిన ప్రసంగంలో నెహ్రూ స్వయంగా వాస్తవాలను అంగీకరించారు. భారతదేశంలో చేరాలని కోరుకునే అన్ని ఇతర రాజ్యాల మాదిరిగానే మహారాజా హరి సింగ్, 1947 జులైలోనే భారత నాయకత్వాన్ని సంప్రదించారు. మాకు అక్కడ ఉన్న ప్రముఖ సంస్థ, నేషనల్ కాన్ఫరెన్స్, దాని నాయకులతో పరిచయాలు ఉన్నాయి, మాకు మహారాజా ప్రభుత్వంతో కూడా పరిచయాలు ఉన్నాయని నెహ్రూ చెప్పారు.

కశ్మీర్‌ అంశంలో నెహ్రూ మొదటి తప్పు

మహారాజా, అతని ప్రభుత్వం భారతదేశంలో చేరాలని కోరుకుంటున్నాయని 1952 ప్రసంగంలో నెహ్రూ అన్నారు. అయితే ఇందుకు కశ్మీర్‌ ప్రజల ఆమోదం కోరుతున్నామని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర భారత చట్టం ప్రకారం ఆయా రాజ్యాలలోని ప్రజల ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. ప్రధానమైనది భారత యూనియన్‌లో చేరడానికి పాలకుల అంగీకారం. ఇతర రాజ్యాలు ఈ పద్ధతినే అవలంబించాయి.

కశ్మీర్‌ ప్రాచీన కాలం నుంచి భారతీయ నాగరికత చైతన్యానికి కేంద్రంగా ఉంది. విభజన సమయంలో కశ్మీర్‌ పాలకుడు షరతులు లేకుండా భారతదేశంతో కలిసిపోవాలనుకున్నాడు. యూనియన్‌ను తిరస్కరించిన వ్యక్తి నెహ్రూ. నెహ్రూ చేసిన తప్పిదాలు 1947 జులై నాటి మోసంతో ఆగలేదు. విభజన తర్వాత రక్తపాతం, హింస కనిపించినప్పటికీ, నెహ్రూ కశ్మీర్‌ విలీనానికి ముందు తన వ్యక్తిగత ఎజెండాను నెరవేర్చుకోవడంలో మొండిగా ఉన్నారు.

కశ్మీర్‌లో నెహ్రూ సృష్టించిన శూన్యత పాకిస్థాన్‌ కశ్మీర్‌లో జోక్యం చేసుకోవడానికి అవకాశం కల్పించింది. చివరికి దాని దళాలు స్థానిక గిరిజనుల ముసుగులో 1947 అక్టోబర్ 20న కశ్మీర్‌ భూభాగాన్ని ఆక్రమించాయి. అప్పుడు కూడా నెహ్రూ చలించలేదు. కశ్మీర్‌లో పాకిస్థాన్ బలగాలు వేగంగా కదులుతున్న సమయంలో మహారాజా హరి సింగ్ మళ్లీ నెహ్రూను భారత యూనియన్‌లో చేరమని వేడుకున్నాడు. కానీ నెహ్రూ తన వ్యక్తిగత ఎజెండాను నెరవేర్చుకోవడానికి ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నారు.

1947 అక్టోబరు 21న పాకిస్థాన్‌ దండయాత్ర ప్రారంభమైన ఒక రోజు తర్వాత, నెహ్రూ జమ్మూ, కశ్మీర్‌ ప్రధాన మంత్రి MC మహాజన్‌కు ఒక లేఖ రాశారు. అందులో ఈ దశలో భారత యూనియన్‌లో కశ్మీర్‌ చేరడానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని పేర్కొన్నారు. అదే లేఖలో నెహ్రూ తన కోరికను వెల్లడించారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు వంటి కొన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, కశ్మీర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి అయిన షేక్ అబ్దుల్లా అటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని సూచించారు.

కశ్మీర్‌ను తిరిగి భారత్‌తో కలపడం కంటే నెహ్రూకి తన మిత్రుడైన షేక్ అబ్దుల్లాను అధికారంలో కూర్చోబెట్టడం చాలా ముఖ్యం. 1947 జులైలో మహారాజా హరిసింగ్ భారతదేశంలో చేరడానికి నెహ్రూను మొదటిసారి సంప్రదించినప్పుడు నెహ్రూ ఉంచిన డిమాండ్ ఇదే.

1947 అక్టోబరు 26 నాటికి పాకిస్థాన్‌ బలగాలు శ్రీనగర్ గేట్లను తట్టింది. నెహ్రూ ఇప్పటికీ తన తన వ్యక్తిగత ఎజెండాను రూపొందించారు. చివరగా 1947 అక్టోబరు 27 విలీన సాధనం ఆమోదం పొందింది. భారత బలగాలు కశ్మీర్‌లోకి దిగి పాకిస్థాన్‌ ఆక్రమణదారులను తిప్పికొట్టడం ప్రారంభించాయి. నెహ్రూ సరైన సమయంలో నిర్ణయం తీసుకొని ఉంటే పాకిస్థాన్‌ దండయాత్ర ఉండదు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ, కశ్మీర్‌(PoJK), జిహాదీ ఉగ్రవాద, 1990లో కాశ్మీరీ హిందువుల సమస్యలు ఉండేవి కావు.

కశ్మీర్‌పై రెండవ తప్పిదం

మహారాజా హరి సింగ్ ఇతర సంస్థానాధీశుల మాదిరిగానే చేరే పత్రంపై సంతకం చేశారు. కశ్మీర్‌ మినహా మిగిలిన అన్ని రాచరిక ప్రాంతాలు నిస్సందేహంగా యూనియన్‌లో విలీనం అయ్యాయి. ఎందుకంటే విలీనాన్ని తాత్కాలికంగా ప్రకటించింది మహారాజు కాదు నెహ్రూ. అక్టోబరు 26న నెహ్రూ MC మహాజన్‌కు మరో లేఖ రాశారు.. ప్రజల అభీష్టానికి అనుగుణంగా అటువంటి విషయాలను ఖరారు చేయాలనే విధానానికి లోబడి తాత్కాలికంగా భారత ప్రభుత్వం ఈ విలీనాన్ని అంగీకరిస్తుంది అని పేర్కొన్నారు. 1947 జులైలో కాకపోతే, 1947 అక్టోబరు 27న కశ్మీర్‌ విలీన ప్రశ్నను శాశ్వతంగా ముగించేందుకు నెహ్రూకి మరో అవకాశం లభించింది. కానీ నెహ్రూ చేసిన తప్పులు ఏడు దశాబ్దాల సందేహాలకు, వేర్పాటువాద మనస్తత్వానికి, రక్తపాతానికి బీజం వేసింది.

కశ్మీర్‌పై నెహ్రూ మూడో తప్పిదం

1948 జనవరి 1న ఐక్యరాజ్యసమితిని నెహ్రూ సంప్రదించడం మరో తప్పిదం. భూముల వివాదాలకు సంబంధించిన ఆర్ఠికల్‌ 35 కింద ఐక్యరాజ్యసమితిని సంప్రదించారు. వాస్తవానికి ఆర్టికల్ 51 పాకిస్థాన్‌ అక్రమంగా ఆక్రమించడాన్ని హైలైట్ చేస్తుంది. మహారాజా కేవలం ఒక విలీన పత్రంపై సంతకం చేశాడు. కశ్మీర్‌ను భారతదేశం, పాకిస్థాన్‌ మధ్య వివాదంగా అంగీకరించడం ద్వారా నెహ్రూ పాకిస్తాన్‌కు స్థానం కల్పించారు. అప్పటి నుంచి ఐరాస తీర్మానాలు భారత్‌ను వెంటాడుతూనే ఉన్నాయి.

కశ్మీర్‌పై నాలుగో తప్పిదం

కశ్మీర్‌లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ప్రజాభిప్రాయ సేకరణను భారతదేశం నిలిపివేస్తుందనే అపోహను కల్పించడం మరో తప్పిదం. 1948 ఆగస్టు 13న ఐక్యరాజ్యసమితి కమీషన్ ఫర్ ఇండియా అండ్ పాకిస్థాన్‌(UNCIP) తీర్మానం మూడు షరతులను కలిగి ఉంది. మొదటిది కాల్పుల విరమణ. రెండవది, పాకిస్థాన్‌ సైన్యాన్ని ఉపసంహరించుకోవడం, మూడవది ప్రజాభిప్రాయ సేకరణ. పార్ట్ III అనేది పార్ట్ I, II నెరవేరడంపై ఆధారపడి ఉంటుంది. 1949 జనవరి 1న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.

కానీ ఆక్రమిత ప్రాంతాల నుంచి తన సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు పాకిస్థాన్ నిరాకరించింది. కాబట్టి 1948 డిసెంబర్ 23న, పార్ట్ I, పార్ట్ II నెరవేర్చనప్పుడు పార్ట్ III కట్టుబడి ఉండదని ఇండియాతో UNCIP ఏకీభవించింది. UNCIP 1949 జనవరి 5న ఒక తీర్మానంలో దీనిని మరింత ధ్రువీకరించింది. కాబట్టి UNCIP తీర్మానంలోని పార్ట్ IIని పాకిస్థాన్‌ నెరవేర్చనందున, దాని తీర్మానం ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ నిష్ఫలమైనదని UNCIP స్వయంగా అంగీకరించింది. ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ కత్తి భారత్‌పై వేలాడుతూనే ఉంది. ఎందుకంటే నెహ్రూ స్వయంగా ఆ తలుపు తెరిచారు కాబట్టి!

కశ్మీర్‌పై ఐదో తప్పిదం

మరో తప్పిదం ఆర్టికల్ 370 (రాజ్యాంగం మధ్యంతర ముసాయిదాలో ఆర్టికల్ 306A) తీసుకురావడం. మొదటి సందర్భంలో అటువంటి కథనానికి ఎటువంటి సపోర్ట్‌ లేదు. ఇతర రాజ్యాలతో పోలిస్తే కశ్మీర్‌ను నెహ్రూ 'ప్రత్యేక' కేసుగా చూశారు. నిజానికి మౌలానా హస్రత్ మోహానీ, యునైటెడ్ ప్రావిన్స్ నుంచి ఒక ముస్లిం ప్రతినిధి. ఆయన రాజ్యాంగ సభ చర్చలలో చాలా అడిగారు. 1949 అక్టోబరు 17న మౌలానా మోహానీ ప్రత్యేకంగా ప్రశ్నించారు. షేక్ అబ్దుల్లాతో వ్యవహరించడంలో నెహ్రూ పాయింట్ మ్యాన్, విభజనాత్మక ఆర్టికల్ 370 (అప్పటి 306A)ని కాపాడిన వ్యక్తి నెహ్రూ లేదా ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ ఈ ప్రశ్నకు సమాధానాలు చెప్పలేదు. నెహ్రూ తన మార్గాన్ని అనుసరించారు, ఆర్టికల్ 370 ఉనికిలోకి వచ్చింది, తద్వారా భారతదేశం మెడకు ఉచ్చులా వేలాడదీసిన వేర్పాటువాద మనస్తత్వాన్ని సంస్థాగతీకరించింది.

ఆ కల్లోల సంవత్సరాలకు ఏడు దశాబ్దాలు గడిచిపోయాయి. నెహ్రూ కుటుంబం, స్నేహం, వ్యక్తిగత ఎజెండాలను జాతీయ ప్రయోజనాల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. పాకిస్థాన్ తన ఆక్రమిత భూభాగంలో కొంత భాగాన్ని చైనాకు అప్పగించింది. జిహాదీ ఉగ్రవాదం 1980లలో మొదలైంది. కాశ్మీరీ హిందువులపై దాడులు జరిగాయి. సొంత దేశంలో శరణార్థులుగా మారారు. ఒక వ్యక్తి చేసిన తప్పిదాల వల్ల ఏడు దశాబ్దాలు, తరాల అవకాశాలు కోల్పోయాయి. అయితే ఏడు దశాబ్దాల తర్వాత 2019 ఆగస్టు 5న చరిత్ర మరో మలుపు తిరిగింది. 1947లో కాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్మిస్తున్న న్యూ ఇండియాకు ఇండియా ఫస్ట్ మాత్రమే మార్గదర్శక సూత్రం. 1947 నుంచి భారతదేశాన్ని వణికిస్తున్న తప్పిదాల పరంపరను ఎట్టకేలకు ప్రధాని మోదీ తొలగించారు. ఆర్టికల్ 370 రద్దు అయింది. లడఖ్ ప్రజలకు ప్రత్యేక యూనియన్ ఏర్పాటు ద్వారా న్యాయం జరిగింది.