ఎన్నికల వేళ బాండ్లు జారీ విక్రయాల విలువ 542 కోట్లు
అత్యధిక బాండ్ల విక్రయం ఎస్బీఐ
ప్రతి పార్టీ డబ్బుంటే ఎన్నికల విజయమే తమకు ప్రధానం అనుకుంటుంది. ఇటీవల ఎన్నికలు మరీ దిగజారీ జరుగుతున్నాయి. మద్యం, బిర్యానీ, నగదు లేనిదే జరగడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న మునుగోడు బై పోల్ దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
ఎన్నికల వేళ..త్వరలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రధాన రాజకీయ పార్టీలకు నిధులు అవసరం.. అందుకోసం తమ పార్టీలకు చెందిన బాండ్లను విక్రయించి మరీ నిధులను సమీకరించుకున్నాయి. అలా దాదాపు రూ.542.25 కోట్లను సేకరించారు. అందుకోసం 741 ఎలక్టొరల్ బాండ్లను విక్రయించారు. ఈ నెల 1 వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 22వ ఎడిషన్ సేల్ సందర్భంగా ఎస్బీఐకి విక్రయించింది. 738 బాండ్ల ద్వారా 542.25 కోట్లను ఎన్ క్యాష్ చేసుకున్నాయి. అయితే గతేడాది జూలైలో 389.50 కోట్లను మాత్రమే సేకరించగలిగారు. ఈ సారి రూ.150 కోట్లకు పైగా నిధులు పెరిగాయి.
22 దశల్లో అమ్మకాలు
2018 నుంచి ఎలక్టొరల్ బాండ్లు అమల్లోకి వచ్చాయి. 22 దశల్లో అమ్మకాలు జరిగాయి. 10791.47 కోట్ల బాండ్ల అమ్మకాలు జరిగాయి. 10,767.88 కోట్లు ఎన్ క్యాష్ చేసుకున్నారు. అయితే ఎన్ క్యాష్ చేసుకోని 23.59 కోట్లు ప్రధానమంత్రి సహాయ నిధికి బదిలీ చేశారు. ఈ మేరకు ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఇందులో హైదరాబాద్..
ఎస్బీఐ హైదరాబాద్ బ్రాంచ్ రూ.117 కోట్ల బాండ్లను విక్రయించిందట. ఆ తర్వాత చెన్నై బ్రాంచ్ రూ.115 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ మేరకు యాక్టివిస్ట్ కమొడొర లోకేశ్ బాత్రా తెలిపారు. గాంధీనగర్ రూ.81.50 కోట్లు, ఢిల్లీ 75.70 కోట్లు, కోల్ కతా 76.10 కోట్లు, ముంబై 40.25 కోట్లు, జైపూర్ 15.70 కోట్లు, చండీగడ్ 8 కోట్లు, లక్నో 8 కోట్లు, బెంగళూరు 6 కోట్ల చొప్పున అందజేశాయి.
ఢిల్లీ
బాండ్లు ఎన్ క్యాష్ చేసుకునే విషయంలో ఢిల్లీ ఫస్ట్ ప్లేసులో ఉంది. అక్కడ రూ.285.15 కోట్లు, కోల్ కతా 143.10 కోట్లు, హైదరాబాద్ 67 కోట్లు ఎన్ క్యాష్ చేసుకున్నాయి. గ్యాంగ్ టక్ 2 కోట్లు, చెన్నై 10 కోట్లు, భువనేశ్వర్ 35 కోట్ల చొప్పున చేసుకున్నాయి. బాండ్లను ఎన్ క్యాష్ చేసుకోవడానికి 25 రాజకీయ పార్టీలు అకౌంట్లను ఓపెన్ చేశాయని బత్రా తెలిపారు. అయితే అవీ రూల్ ప్రకారం జరిగాయని తెలిపారు.
By Shashidhar S Oneindia
source: oneindia.com