home page

పన్నీర్ సెల్వం పై బాటిళ్లతో దాడి

ఓపీఎస్ వెర్సెస్ ఈపీఎస్

 | 
పన్నీర్ సెల్వం పై దాడి

చెన్నై:నేడు చెన్నైలోని వనగరంలోని శ్రీవారు వేంకటాచలపతి ప్యాలెస్‌లో పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. అన్నాడీఎంకేలోని మాజీ మంత్రులు, ముఖ్య నేతలు రెండుగా విడిపోయారు. సర్వసభ్య సమావేశానికి ముందే పార్టీ కార్యాలయం బయట అన్నాడీఎంకు సంబంధించిన కొన్ని బ్యానర్లను చింపివేశారు. బ్యానర్ల చింపి వేత శశికళ వర్గం పనిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

సర్వసభ్య సమావేశంలోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓపీఎస్, ఈపీఎస్ మద్దుదారులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. దీంతో సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. సమావేశం నుంచి బయటకు వెళుతున్న పన్నీర్ సెల్వంపై కొందరు దాడికి యత్నించారు. ఆయనపై పళని స్వామి మద్దతుదారులు వాటర్ బాటిళ్లను విసిరేశారు. అంతేకాదు, పన్నీర్ సెల్వం కారులో గాలి తీసివేశారు. దీంతో మరో కారులో పన్నీర్ సెల్వం బయలుదేరారు. జూలై 11న అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం జరగనుంది.

అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం కావాలన్న డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం చుట్టూ వివాదం రాజుకుంది. పార్టీని చేజిక్కించుకునేందుకు సీనియర్ నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గంపోటీ పడుతున్న సమయంలో ఈ భేటీ జరిగింది.

#WATCH | Tamil Nadu: Bottles hurled at AIADMK coordinator and former Deputy CM O Panneerselvam at the party's General Council Meeting today. The meeting took place at Shrivaaru Venkatachalapathy Palace, Vanagaram in Chennai. 

He walked out halfway through the meet.