home page

తెలంగాణ పథకాల కోసం కర్నాటక రైతులు ఆందోళన

  జీఎస్టీ రద్దు చేయాలి         కర్నాటక  రైతుల డిమాండ్  

 | 
karnataka farmers agitation

ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం రైతులు భారీ ధర్నా చేశారు. దీంతో కర్ణాటక సర్కార్ జాతీయ రైతు సంఘం నాయకులను అరెస్ట్ చేసింది. కర్ణాటకలో కూడా తెలంగాణ రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

కర్ణాటక రైతులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున రైతులు రాజధాని బెంగళూర్ కు తరలివచ్చారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. స్థానిక మెజిస్టిక్ రైల్వే స్టేషన్ నుంచి అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కర్ణాటక రైతులకు సంఘీభావం తెలిపారు దక్షిణ భారత రైతు సమాఖ్య నాయకులు కోటపాటి నరసింహం నాయుడు, నల్లమల్ల వెంకటేశ్వరరావు , పీకే దైవసిగామని, కేయం రామ గౌoడర్, కె శాంత కుమార్, ఏఎస్ బాబులతో పాటు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన శివకుమార్ కక్కాణి, దల్లే వాల్ లను అరెస్ట్ చేశారు స్థానిక పోలీసులు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని. చెరుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించానలి..వ్యవసాయ ఉత్పత్తులకు, యంత్ర పరికరాలపై జీఎస్టీ రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.