home page

కర్నాటకలో మతమార్పిడి నిరోధక బిల్లుకు కేబినెట్ ఓకే

వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశం

 | 

దక్షిణాది రాష్ట్రాలలో తొలి మతమార్పిడి నిరోధక బిల్లు కర్నాటక తోనే ప్రారంభం

బెంగళూరు : మత మార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ర్ట హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర తెలిపారు.

కర్ణాటక క్యాబినెట్.. మత మార్పిడి నిరోధక బిల్లును ఆమోదించిందని, అప్పటి వరకు ఆర్డినెన్స్ అమలులో ఉంటుందని చెప్పారు.వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని తెలిపారు. అంతకు ముందు గురువారం ఆ రాష్ర్ట క్యాబినెట్ సమావేశం జరిగింది. సమావేశానికి ముందు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తమ ప్రభుత్వం ఈ చర్యను అమలు చేయబోతోందని చెప్పారు. అయితే, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తొందరపాటు, మతమార్పిడి నిరోధక బిల్లును ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించాల్సిన అవసరాన్ని ప్రశ్నించారు.