home page

కాంగ్రెస్ పార్టీ తో పొత్తుకు వైసీపి సిద్ధ పడుతుందా?

ప్రశాంత్ కిషోర్ సలహా జగన్ రెడ్డి పాటిస్తే...

 | 
Pk team

ఇది జరిగే పనేనా ? రాజకీయ వర్గాల్లో చర్చ

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండాలన్న నిబంధన ఏమీలేదు. నిన్నటి శతృవు రేపటి మితృడు అవుతారు. సరిగ్గా అదే ఇప్పుడు వైసీపి విషయంలో జరిగే అవకాశం వుందని ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న వైసీపి కాంగ్రెస్ వ్యతిరేక పునాది గా ఎదిగిన పార్టీ.  మరి ఆపార్టీ తన ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కీషోర్ చెప్పినట్లు నడుచుకుని కాంగ్రెస్ తో జత కడతారా అన్న ప్రశ్నకు రానున్న పరిణామాలు సమాధానం చెప్పాలి. విషయం ఏంటంటే జాతీయ స్థాయిలో బిజెపికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలన్న ఆలోచన పీకే కు వచ్చిందట. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో బలంగా వున్న వైసీపిని కాంగ్రెస్ తో జత కలిపేలా ప్రశాంత్ కిషోర్ ఆలోచన చేస్తున్నారన్న విషయం ఢీల్లీలో చక్కెర్లు కొడుతోంది. కాంగ్రెస్ కు వైసీపీ కి మధ్య వచ్చే ఎన్నికల నాటికి సరికొత్త పొత్తులు పొడవనున్నాయా..? ఎన్నికలేవైనా ఒంటరిగానే పోటీ చేస్తామంటున్న వైసీపీ  త్వరలో మరోపార్టీతో జతకట్టబోతోందా..? ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  ఈ కొత్తపొత్తుకు నాంది పలకబోతున్నారా..? పొత్తుల విషయంలో వైసీపీ వైఖరి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు యత్నిస్తున్న అధిష్టానానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఊహించని ప్రతిపాదన చేశారు. దేశంలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలంటే కొన్ని మార్పులు అవసరమని సూచించారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ నేతలకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోని అంశాలు కొన్ని  బయటకొచ్చాయి.

ఇందులో భాగంగా పలురాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తుపెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించినట్లు తెలుస్తోంది. ఏపీలో దాదాపు కనుమరుగైన పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీతో జతకట్టాలని పీకే సూచించినట్లు సమాచారం. 168 ఎంపీ స్థానాల్లో ప్రాంతీయ పార్టీలో కలిసి బరిలో దిగితే మంచి ఫలితాలుంటాయని ఆయన చేసిన ప్రధాన సూచన.

ఐతే ఏపీ విషయానికి వస్తే ప్రస్తుతానికి వైసీపీకి పొత్తులతో పనిలేదు. ఎన్నిక ఏదైనా సింగిల్ గానే బరిలో దిగుతామని ఆ పార్టీ నేతలు ప్రతి రోజూ ప్రకటిస్తూనే ఉన్నారు. 2019లో ఒంటరిగానే పోటీ చేసిన వైసీపీ.. అధికారంలో ఉన్న టీడీపీని ఓడించి ఏకంగా 151 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 80 శాతానికి పైగా అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించారు. ఇలాంటి పరిస్థితుల్లో పీకే సలహా మేరకు కాంగ్రెస్ నుంచి పొత్తు ప్రతిపాదన వస్తే జగన్ అంగీకరిస్తారా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నేరుగా స్నేహం చేయకపోయినా బయటి నుంచి సహకారం అందిస్తోంది వైసీపీ. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు అంటే మాత్రం బీజేపీని విమర్శించకపోయినా కయ్యానికి దిగినట్లే అవుతుంది.

ఐతే వైసీపీతో పొత్తుకు సోనియా గాంధీ అంగీకరిస్తే.. జగన్ ను ఒప్పించే బాధ్యతను పీకేకే అప్పగించే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఏపీతో పాటు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికిలో లేదు. పికే సూచన కూడా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని సూచించడంతో ఆ పార్టీలు ఇందుకు అంగీకరిస్తాయా..? లేదా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు ఇటీవల టీడీపీ ఇద్దరు టీడీపీ ఎంపీలు.. సోనియా గాంధీని కలిసి పొత్తు విషయం మాట్లాటారాన్న ప్రచారం జోరుగా సాగుతోంది.