home page

ఎవరు ఈ 'పీకే': తేజశ్వి యాదవ్

పీకే సర్వే జనంతో చేసిందేనా?

 | 
Tejaswi yadav

బీహార్లో అభివృద్ధి లేదన్న 'పీకే'

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. పీకే అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని తేజస్వీ ధ్వజమెత్తారు.

అసలు పీకే ఎవరు.. ఆయన ఎక్కడ ఉంటాడో తనకు తెలియదన్నారు. సీఏఏ-ఎన్ఆర్సీలపై మీడియా అడిగిన ప్రశ్నలపై ఆయన మాట్లాడుతూ.. తాము గతంలో సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకించామన్నారు.

భవిష్యత్ లో పార్లమెంట్ లోనూ దీనిపై గళమెత్తుతామన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు చట్టాలను బీహార్ లో తీసుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదన్నారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. వీరిద్దరి పాలనలో బీహార్ అభివృద్ధిలో ముప్పై ఏండ్లు వెనక్కి వెళ్లిందన్నారు.

రాష్ట్రాన్ని లాలూ ప్రసాద్ పదిహేనేండ్లు పాలించాడని, నితీశ్ కుమార్ పదిహేండ్లు పాలించారని ఆయన అన్నారు. వీరి పాలనలో బీహార్ లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదన్నారు.