home page

జుడీషియల్ విస్టాపై కేంద్రం వైఖరి ఏమిటో తెలియజేయాలి: సుప్రీం

వివరణ కోరిన సుప్రీం కోర్టు సీజేఐ రమణ బెంచ్

 | 
Sc

సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు వేసవి సెలవుల తర్వాత లిస్టింగ్‌కు పరిశీలిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.

'జ్యుడీషియల్‌ విస్టా'పై వైఖరేమిటో చెప్పాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. దేశరాజధాని లో పార్లమెంటు సహా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోట ఉండేలా చేపట్టిన 'సెంట్రల్‌ విస్టా' ప్రాజెక్టు మాదిరిగా..సుప్రీంకోర్టు ప్రాంగణంలో ట్రైబ్యునళ్లు, మహిళా కమిషన్‌ లాంటి అన్ని రకాల న్యాయ సంస్థలను ఒకే చోట నిర్మించేలా.. కక్షిదారులు, లాయర్లు, క్లర్క్‌లు, న్యాయ విద్యార్థుల సదుపాయం కల్పించేలా 'జ్యుడీషియల్‌ విస్టా' ఏర్పాటుకు కేంద్ర న్యాయశాఖ, రోడ్లు, భవనాల శాఖను ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టు బార్‌ నేత ఎ.కుమార్‌ ప్రసాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ వినీత్‌ సరాన్‌, జేకే మహేశ్వరిల ధర్మాసనం సోమవారం విచారించింది. దీనిపై కేంద్రం తన వైఖరిని తెలియజేయాలని సూచించింది. మంగళవారం విచారణకు సొలిసిటర్‌ జనరల్‌ హాజరవ్వాలని ఆదేశించింది.

ఆర్టికల్ 370 రద్దు పై పిటిషన్లు చూస్తాం

2019 ఆగస్టులో.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంట్‌ బిల్లును పాస్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర పడడంతో.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దయింది.

దీన్ని సవాలు చేస్తూ 2019 డిసెంబరులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. అప్పటి సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఈ పిటిషన్లపై విచారణ బాధ్యతను ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి అప్పగించారు. ఓ పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాది శేఖర్‌నఫాడే సోమవారం జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ హిమాకోహ్లిల ధర్మాసనానికి పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను గుర్తుచేశారు. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పందిస్తూ..''నేను చూస్తాను'' అని అన్నారు.