home page

'ప్రధాని ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తాం'

శివసేన,ఎన్సీపీ సంచలన ప్రకటన 

 | 
మోడీ

దేశవ్యాప్తంగా శోభాయాత్రలు మతరాజకీయమే

హనుమాన్‌ చాలీసా పఠనం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. తాము సీఎం ఉద్ధవ్‌ ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠనం చేస్తామని ఎంపీ నవనీత్‌ రాణా దంపతులు పేర్కొనడంతో ఈ వివాదం ప్రారంభమైంది
.దీంతో ప్రభుత్వం, హిందుత్వవాదుల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో శివసేన, ఎన్‌సీపీ పార్టీలు ఎదురుదాడికి దిగాయి. ఈ అస్త్రాన్ని మోడీపైకి గురిపెట్టాయి. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం మాతోశ్రీ వెలుపల హనుమాన్‌ చాలీసా చదవడానికి బదులు ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నివాసాల వద్ద హనుమాన్‌ చాలీసా పఠించాలని కాషాయ నేతలతో పాటు రాణా దంపతులకు శివసేన సూచించింది.

హనుమాన్‌ చాలీసా వివాదంపై కాషాయ పార్టీ తీరును శివసేన అధికార పత్రిక సామ్నా తప్పుపట్టింది. దీని వెనుక నిస్ప్రహకు లోనైన బీజేపీ ప్రోద్బలం ఉందని ఆరోపించింది. ఎన్‌సీపీ కూడా శివసేనతో గొంతుకలిపింది. మోడీ అధికారిక నివాసం ముందు హనుమాన్‌ చాలీసా, నమాజ్‌ చదువుతామని, అందుకు తమకు అనుమతి కావాలంటూ ఆపార్టీ నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాసింది. ఎన్సీపీ నాయకురాలు ఫమీదా హసన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ”ఢిల్లీలో లోకకల్యాణ్‌ మార్గ్ లోని ప్రధాని అధికారిక నివాసం ముందు నమాజ్‌ చేస్తా. హనుమాన్‌ చాలీసా, దుర్గా చాలీసా, నమోకార్‌ మంత్ర చదువుతా. ఇందుకు నాకు అనుమతి కావాలి” అని ఫమీదా హసన్‌ డిమాండ్‌ చేశారు.