వారణాసి జిల్లా కోర్టులో ముగిసిన విచారణ: తీర్పు రేపటికి వాయిదా
సుప్రీం కోర్టు ఆదేశాలు తర్వాత ఒక్క రోజు లోనే విచారణ పూర్తి
Updated: May 23, 2022, 15:16 IST
| 
వారణాసి జిల్లా కోర్టు లో జానవాపి మసీదు కేసు విచారణ సోమవారం ముగిసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు జిల్లా జడ్జి ఏ.కే.విశ్వేషవ సోమవారంనాడు ఈకేసుకు విచారణ అర్హత పై విచారణ జరపగా 19 మంది న్యాయవాదులు,నలుగురు కక్షీదారులు హాజరయ్యారు. కోర్టు సిబ్బంది కేసుకు సంబంధించి వకాల్తా నామా ఉన్న వారినే కోర్టు హాలులో కి అనుమతించారు. తొలగింపునకు గురైన కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రా ను కోర్టు లోకి అనుమతించలేదు.
ఇరువాదనలూ విన్న జడ్జి తీర్పు ను రేపటికి వాయిదా వేశారు. ఈ కేసును ట్రయిల్ కోర్టు నుంచి జిల్లా కోర్టు కు సుప్రీం కోర్టు బదలీ చేసింది.