షిండేపై ఉద్ధవ్ న్యాయపోరాటం
అనర్హత వేటు పిటీషన్ పెండింగ్ పర్యవసానం
Updated: Jul 10, 2022, 00:08 IST
|
ముంబై: ఏక్ నాథ్ షిండేని ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఆహ్వానించిన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వివాదం పెండింగ్ లో ఉండగానే ఆ 16 మంది శాసన సభ సమావేశాల్లో పాల్గొనడానికి అవకాశం ఎలా ఇచ్చారు ? అని ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ లోని నాయకులు ప్రశ్నిస్తున్నారు. 16 మంది ఎమ్మెల్యేలు ఫ్లోర్ టెస్ట్ లో పాల్గొని ఏక్ నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని, నియమాలు ఉల్లంఘించి 16 మంది ఓటింగ్ లో పాల్గొనడానికి గవర్నర్ అవకాశం ఇచ్చారని ఆరోపిస్తూ ఉద్దవ్ ఠాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మీద న్యాయపోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యారని ఆయన వర్గీయులు అంటున్నారు.ఏక్ నాథ్ దెబ్బతో ఉద్దవ్ ఠాక్రే ఏక్ నిరంజన్ మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు ఏక్ నాథ్ షిండేతో పాటు శివసేనకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించి ముంబాయి నుంచి గుజరాత్ లోని సూరత్ కు చెక్కేశారు. తరువాత ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన తరువాత ఏక్ నాథ్ షిండే వర్గం ముంబాయిలో అడుగుపెట్టింది. అనర్హత వేటు పెండింగ్ మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ముందే ఊహించిన ఉద్దవ్ ఠాక్రే 16 మంది శివసేన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని డిప్యూటీ స్పీకర్ కు మనవి చేశారు. ఈ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లి అక్కడ పెండింగ్ లో ఉంది.
ఇదే సమయంలో ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ జూన్ 28వ తేదీన మహారాష్ట్ర గవర్నర్ ను కలిశారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ వెంటనే ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్ మీద మండిపడిన శివసేన గవర్నర్ భగత్ సింగ్ ను కలిసిన కొన్ని గంటల్లోనే ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి గవర్నర్ కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్దవ్ ఠాక్రే వర్గం, కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు మండిపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి చాలా మంది కారణం అయ్యారని ఉద్దవ్ ఠాక్రే వర్గం, కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు ఆరోపించారు. జెట్ స్పీడ్ గవర్నర్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ తుపాకి తూటా కంటే వేగంగా, జెట్ స్పీడ్ రైంజ్ లో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఇచ్చారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఏక్ నాథ్ షిండేని ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఆహ్వానించిన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వివాదం పెండింగ్ లో ఉండగానే ఆ 16 మంది శాసన సభ సమావేశాల్లో పాల్గొనడానికి అవకాశం ఎలా ఇచ్చారు ? అని ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ లోని నాయకులు ప్రశ్నిస్తున్నారు. 16 మంది ఎమ్మెల్యేలు ఫ్లోర్ టెస్ట్ లో పాల్గొని ఏక్ నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని, నియమాలు ఉల్లంఘించి 16 మంది ఓటింగ్ లో పాల్గొనడానికి గవర్నర్ అవకాశం ఇచ్చారని ఆరోపిస్తూ ఉద్దవ్ ఠాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.