home page

చార్ ధామ్ యాత్రలో ఇప్పటికి 20మంది మృతి

ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన

 | 
Chardham death toll
మే 3న చార్ ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 20 మంది యాత్రికులు మరణించారు.. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖా వెల్లడించింది.

అయితే మరణించిన వారిలో చాలా వరకు ఎక్కువ శాతం గుండె సంబంధిత సమస్యలు లేదా హై ఆల్టిట్యూడ్ సిక్నెనస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది.

యమునోత్రి, గంగోత్రి ధామ్‌లో 14 మంది ప్రయాణికులు చనిపోయారు. వీరిలో నేపాలీ కూలీ కూడా ఉన్నాడు. ఇవి కాకుండా కేదార్‌నాథ్‌లో 5 మంది, బద్రీనాథ్‌లో ఒకరు మరణించారు. ఇలా ఆరు రోజుల్లో 20 మంది యాత్రికులు మృతి చెందడం యాత్ర నిర్వాహకులను ఆందోళనకు గురిచేసింది.

కాగా ఈ నెల 3వ తేదీన గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరుచుకోగా, ఇక కేదార్‌నాథ్‌ను మే 6వ తేదీన, బద్రీనాథ్‌ను మే 8వ తేదీన తెరిచిన విషయం తెలిసిందే.