త్రిపుర సీఎం దేవ్ రాజీనామా
త్రిపుర లో 2018 లో తొలి బిజెపి ప్రభుత్వం
Updated: May 14, 2022, 21:18 IST
| కొత్త సీఎం వేటలో బిజెపి
త్రిపుర సీఎం బి పలవఖమ కుమార్ దేబ్ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం హఠాత్తుగా కేంద్ర బిజెపి నుంచి వచ్చిన ఆదేశం మేరకు ఆయన రాజీనామా సమర్పించారు.
2018లో సీపిఎం నేతృత్వంలో ని మాణిక్ సర్కార్ ప్రభుత్వం ఓటమి చెందినది. 23, సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మాణిక్ ప్రభుత్వం బిజెపి చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది. అనాడు ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసిన దేబ్ ప్రభుత్వం నాలుగేళ్ళుగా త్రిపురలో ప్రభుత్వం నడుపుతోంది. ఆరునెలల క్రితం ఒకసారి సీఎం ను మార్చే అవకాశం ఉందని ప్రచారం సాగింది.ఎందుకో కాని ఆ ప్రచారం నిజం కాలేదు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. బిజెపి కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో ముఖ్యమంత్రి ని మార్చాలని నిర్ణయం తీసుకుంది.