తాజ్ మహల్ భూభాగం జైపూర్ రాజవంశీయులదే
బిజెపి ఎంపి దివ్య కుమారి
కొత్త వాదన
Wed, 11 May 2022
| 
తాజ్ మహల్ లో ఉన్న 20గదులు తెరవాలని డిమాండ్ మొదలైంది
ఆగ్రా లో తాజ్ మహల్ నిర్మించిన స్థలం నిజానికి జైపూర్ రాజవంశీయులది అంటున్నారు బీజేపీ ఎంపీ దివ్యకుమారి. దానిని మొగల్ చక్రవర్తి షాజహాన్ స్వాధీనపరచుకున్నారంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు.
ఇప్పటికే తాజ్ మహల్ లో మూసివున్న 20గదులను తెరవాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ లో పిటీషన్ దాఖలు అయ్యింది. గతంలో ఇది తేజో మహాలయమని పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్ ఇంకా విచారణకు రాలేదు.
ఇప్పుడు ఈ భూమి జైపూర్ రాజవంశీయులదే అన్న విషయం వెలుగులోకి వచ్చింది.