హైకోర్టు తరలింపుపై రాష్ట్రానిదే బాధ్యత
పార్లమెంటులో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు
Updated: Jul 22, 2022, 16:30 IST
|
హైకోర్టును కర్నూలు తరలించే యువచనలో ఏపీ ప్రభుత్వం....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు, ఇద్దరు సమన్వయం చేసుకొని సిఫార్సులు కేంద్రానికి పంపాలని వివరించిన న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్‌కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందిందని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. కర్నూల్‌కు హైకోర్టు తరలింపు హైకోర్టుతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. శుక్రవారం లోక్‌సభలో కర్నూల్‌కు హైకోర్టు తరలింపు అంశంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనురాధా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమాధానం ఇచ్చారు.
ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్‌కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందింది. కర్నూల్‌కు తరలింపుపై హైకోర్టుతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి.హైకోర్టు నిర్వహణ ఖర్చులన్నీ రాష్గ్ర ప్రభుత్వమే భరిస్తుంది.హైకోర్టును కర్నూల్‌కు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది.ఆ తర్వాత ఆ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు కిరణ్ రిజిజు.