రెండు ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ దక్కలేదు
ఒడిఫాలో బిజూజనతాదళ్
కేరళలో కాంగ్రెస్
- ఒడిశా, కేరళ ఉపఎన్నికల్లో ఘోర పరాభవం
- రెండు రాష్ర్టాల్లో మూడో స్థానానికి పరిమితం
భువనేశ్వర్/తిరువనంతపురం, జూన్ 3: ఒడిశా, కేరళ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది.
ఈ రెండు రాష్ర్టాల్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన బైపోల్స్‌లో కాషాయ పార్టీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆయా రాష్ర్టాల్లో చివరిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే తాజా ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయి. ఒడిశాలోని బ్రజరాజ్‌నగర్ స్థానంలో సీఎం నవీన్ పట్నాయక్ పార్టీ బిజూ జనతాదళ్(బీజేడీ)కి చెందిన అభ్యర్థి అలక మహంతి 66 వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. 27,831 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో నిలవగా, బీజేపీ అభ్యర్థి రాధారాణి పాండాకి కేవలం 22,630 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక, కేరళలో థ్రిక్కకారా అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకున్నది. ఆ పార్టీ అభ్యర్థి ఉమా థామస్ సీపీఎంపై 25 వేల మెజార్టీతో గెలిచారు. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఉత్తరాఖండ్‌లోని చంపావత్ నుంచి సీఎం పుష్కర్ సింగ్ ధామి గెలుపొందారు.
స్థానం బీజేపీ ఓట్లు
బ్రజరాజ్‌నగర్(ఒడిశా) 2019 ఎన్నికల్లో 68,153
2022 బైపోల్స్‌లో 22,630
థ్రిక్కకారా(కేరళ) 2021 ఎన్నికల్లో 15,218
2022 బైపోల్స్‌లో 12,957