home page

తగ్గే అవకాశం ఉన్న స్టీలు సిమెంటు ధరలు: కొద్ది ఊరట

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి సన్నాహాలు

 | 
Cement

ప్లాస్టిక్, ముడిపదార్ధాలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు

పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు ప్రకటించిన కొద్దిసేపటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో కీలక ప్రకటన చేశారు.

ప్లాస్టిక్,సిమెంట్,ముడి పదార్థాలపై సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా దేశంలో సిమెంట్,స్టీల్ కొరత తగ్గి ధరలు తగ్గుతాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. తద్వారా గృహ నిర్మాణ వ్యయం భారీగా తగ్గుతుందని చెప్పారు.

దిగుమతిపై అధికంగా ఆధారపడే ప్లాస్టిక్​ ఉత్పత్తుల ముడి పదార్థాలపై కస్టమ్స్​ డ్యూటీని తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. దీని ద్వారా తయారీ ఖర్చు భారీగా తగ్గుతుందన్నారు. వాటితో పాటు ఇనుము, స్టీల్​ ఉత్పత్తుల ధరలు తగ్గించేందుకు ముడి సామగ్రిపై కస్టమ్స్​ డ్యూటీ తగ్గిస్తున్నట్లు చెప్పారు. సిమెంట్​ను అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ధరలు తగ్గేందుకు మెరుగైన రవాణా వ్యవస్థలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.