home page

చిన్న ఆన్లైన్ చెల్లింపులు పెద్ద ఆర్ధిక వ్యవస్ధను తెస్తాయి: ప్రధాని మోడి

20 వేల కోట్ల కు చేరిన ఆన్ లైన్ చెల్లింపులు          ం

 | 
Modi
దేశంలో ఇప్పుడు రోజుకు రూ.20 వేల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇది సౌకర్యాలను మెరుగుపర్చడమే కాకుండా నిజాయితీతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నదని అన్నారు.

ఆదివారం ఆయన మాన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. చిన్న ఆన్‌లైన్ చెల్లింపులు పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతున్నాయని చెప్పారు. అనేక కొత్త ఫిన్‌టెక్ స్టార్టప్‌లు రాబోతున్నాయని అన్నారు. డిజిటల్ చెల్లింపులపై అవగాహన ఉన్న వారు, దాని వల్ల కలిగే లాభాలను ఇతరులతో పంచుకోవాలని ఆయన కోరారు. మీ అనుభావాలు దేశంలోని ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధాని చెప్పారు.

ప్రస్తుతం దేశంలో ఒక్క రోజులో రూ. 20 వేల కోట్ల విలువైన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని, మార్చిలో UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ట్రాన్సాక్షన్స్ రూ. 10 లక్షల కోట్లకు చేరుకున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇది దేశంలో సౌకర్యాలను పెంచడమే కాకుండా నిజాయితీతో కూడిన వాతావరణాన్ని కూడా ప్రోత్సహిస్తోందని అన్నారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న ప్రారంభించిన ప్రధానమంత్రి సంగ్రహాలయ గురించి దేశవ్యాప్తంగా ప్రజలు తనకు లేఖలు, సందేశాలు రాశారని చెప్పారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాలు అయిన సందర్భం కంటే ప్రధాన మంత్రుల సహకారాన్ని గుర్తుంచుకోవడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదని ప్రధాని మోదీ అన్నారు.

సెలవు రోజుల్లో స్థానిక మ్యూజియాన్ని సందర్శించాలని, 'మ్యూజియం మెమోరీస్' అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి వారి అనుభవాలను పంచుకోవాలని ఆయన ప్రజలను కోరారు. దివ్యాంగులు క్రీడలతో పాుట కళలు, విద్య ఇతర అనేక రంగాల్లో అద్భుతాలు చేస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. సాంకేతికత శక్తితో వారు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని కొనియాడారు. కాగా మేలో పలు పండగలు రానున్నాయని, ఈ నేపథ్యంలో కోవిడ్‌కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.