home page

బెంగాల్లో శతృఘ్న సిన్హా గెలుపు

అసన్సోల్లో 2 లక్షల ఓట్లు మెజారిటీ

 | 
శతృఘ్న సింహా
పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ లోక్ సభ సీటుకు జరిగిన ఉపఎన్నికల్లో టీఎంసి అభ్యర్ధి శతృఘ్న సిన్హా 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీహార్ కు చెందిన సిన్హా గత ఏడాది బెంగాల్ ఎన్నికల నేపధ్యంలో యశ్వంత్ సిన్హా తో కలిసి మమతా బెనర్జీ కోరిక మేరకు టీఎంసీలో చేరారు. యశ్వంత్ సిన్హా జాతీయ ఉపాధ్యక్షుడు గా ఉన్నారు. శతృఘ్న సిన్హా మాత్రం అసన్సోల్ ఉప ఎన్నికల్లో టీఎంసి అభ్యర్ధి గా రంగంలోకి దిగారు. 2 లక్షల మెజారిటీ తో బిజెపి అభ్యర్థి ని ఓడించారు.
నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐదు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయ్యింది. బెంగాల్‌లో మరోసారి అధికార తృణమూల్‌ సత్తా చాటింది.
అసన్‌సోల్‌ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్ధి శత్రుఘన్‌సిన్హా ఘనవిజయం సాధించారు. బీజేపీ అభ్యర్ధిపై ఆయన రెండు లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. బాలిగంజ్‌ అసెంబ్లీ స్థానంలో టీఎంసీ అభ్యర్ధి బాబుల్‌ సుప్రియో గెలుపొందారు. బీహార్‌ లోని బొచహార్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్ధి గెలుపొందారు. చత్తీస్‌ఘడ్‌ లోని ఖైరఘర్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధి గెలుపొందారు. మహారాష్ట్ర లోని కొల్హాపూర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ గెలిచింది.