రుణ రికవరీ ఏజెన్సీలపై ఆర్బీఐ కొరడా: శక్తి కాంత్ దాస్
ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ హెచ్చరిక
Updated: Jun 18, 2022, 17:59 IST
| 
అప్పులు వసూలు చేయడానికి కొన్ని బ్యాంకులు/ఆర్థిక సంస్థలు వేధించడం, బెదిరించడం వంటి పద్ధతులను వాడటంపై ఆర్బీఐ తీవ్రంగా స్పందించింది.
కస్టమర్లను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఎప్పుడుపడితే అప్పుడు ఫోన్ చేసి అప్పు కట్టాలని అడగడం, బూతులు మాట్లాడటం వంటి పద్ధతులను సహించబోమని అన్నారు. ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. ''అర్థరాత్రి కూడా ఫోన్ చేసి అప్పుకట్టాలని అడుగుతున్నారంటూ లోన్ రికవరీ ఏజెంట్లపై కంప్లైంట్లు అందుతున్నాయి. బూతులు మాట్లాడుతున్నారని సమాచారం వస్తోంది. ఇలాంటివి ఆమోదనీయం కాదు. ఫైనాన్షియల్ సంస్థలు ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రెగ్యులేటెడ్ సంస్థలపై అయితే నేరుగా మేం చర్యలు తీసుకుంటాం. అన్ రిజిస్టర్ సంస్థలపై పోలీసులు, ఇతర ఏజెన్సీలు చర్యలు తీసుకుంటాయి'అని ఆయన అన్నారు. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్లు చేశారు. కస్టమర్లను ఇలాంటి సమస్యల నుంచి రక్షించడానికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. వేధింపులను అడ్డుకోవడానికి ఇది సిఫార్సులు చేయనుంది.
డిజిటల్ ఫైనాన్షియల్ ప్రొడక్టులు, డిస్ట్రిబ్యూషన్పైనా ఫోకస్ చేస్తుంది. డిజిటల్ లెండింగ్పై డిస్కషన్ పేపర్‌ను విడుదల చేయనుంది. టెక్నాలజీ, డిజిటల్ సర్వీసుల వాడకం ఎక్కువై సైబర్ నేరాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ కొన్ని సిఫార్సులు చేసిందని, అవి పరిశీలనలో ఉన్నాయని శక్తికాంత దాస్ తెలిపారు. ఇల్లీగల్‌గా అప్పులు ఇస్తున్న 600 యాప్స్‌ను కూడా గుర్తించిందని, వీటిపై సంబంధిత ఏజెన్సీలు చర్యలు తీసుకుంటాయని వివరించారు. ఇట్లాంటి యాప్స్ నుంచి అప్పులు తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు.