home page

బీహార్ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్ ప్రవేశం

పదేళ్ళు ప్రజా స్పందన అంచనా వేశా: ప్రశాంత్ కిషోర్

 | 

ప్రజా సేవకుడిగా పనిచేయాల్సి ఉంటుంది :జనసురాజ్ పార్టీ ఏర్పాటు 

బీహార్ రాజకీయాల్లోకి ప్రశాంత్ కీషోర్ రానున్నారు. బీహార్లో జన సురాజ్ పేరుతో ప్రజల మధ్యకి రానున్నారు. ఇటీవల వరకూ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు యత్నం చేశారు. అందుకుగాను కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో కాంగ్రెసు లో చేరటంలేదని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాలలో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు.‌ ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆర్జేడీ నాయకులతో ఎక్కువ సమయం ఉంటున్నారు. వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇఫ్తార్ విందు లో ఆర్జేడీ నాయకులతో కలిసి నితీష్ వున్నా రు. అంతేకాదు లౌడు స్పీకర్లు తొలగించే అఃశంపై చాలా స్పష్టంగా నితీష్ మాట్లాడారు. బీహార్ లో ప్రస్తుతం నితీష్ బిజెపి సహకారంతో ప్రభుత్వం నడుపుతున్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్ జెడియులో చేరి ఆ పార్టీ కీ ఉపాధ్యక్షుడు గా పనిచేశారు. అనంతరం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.