home page

పుదుచ్చేరి లో పాగాకు కమలం

ఎన్ ఆర్ కాంగ్రెస్ లో చీలికకు యత్నాలు

 | 
Bjp
పుదుచ్చేరి : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎలాగైనా పాగా వేయానికి బిజెపి కుతాంత్రాలు పన్నుతోంది. మిత్రపక్షమైన ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ను చీల్చి, ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటువచ్చే స్వాతంత్య్ర దినోత్సవం రోజున పుదుచ్చేరిలో బిజెపి ప్రభుత్వం ఉంటుందని కేంద్ర మంత్రి అమిత్‌ షా ఇప్పటికే ప్రకటించారు. ఏప్రిల్‌ 24న ఇక్కడ అమిత్‌ షా పర్యటించారు. ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ను చీల్చడానికి ఈ పర్యటనను తొలి అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ బిజెపికి ముగ్గురు నామినేట్‌ సభ్యులతో సహా తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు.

మరో ముగ్గురు ఇండిపెండింట్‌ సభ్యుల మద్దతు ఉంది. ఇక ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి ఐదుగుర్ని చేర్చుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని బిజెపి భావిస్తోంది. తమిళనాడులో ప్రవేశించేందుకు పుదుచ్చేరి ముఖద్వారమని ఆ పార్టీ పేర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి కొంత మంది సభ్యులను చీల్చి పుదుచ్చేరిలో పాగా వేయడానికి బిజెపి ఎలా ప్రయత్నించినదీ చూశాం.

 చేయాలన్నది బిజెపి పన్నాగం.