home page

కుతుబ్ మినార్ కాదు,అది సూర్య స్తంభం: రాజావిక్రమాదిత్య నిర్మాణం

పురావస్తు శాఖ మాజీ శర్మ స్పష్టీకరణ

 | 
Qutub minar
హైదరాబాద్ : ప్రస్తుతం స్మారక చిహ్నాల వివాదాలు తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ ప్రాంతీయ డైరెక్టర్ ధరమ్‌వీర్ శర్మ.

కుతుబ్ మినార్‌ను రాజా విక్రమాదిత్య నిర్మించారని, కుతుబ్ అల్-దిన్ ఐబక్ చేత నిర్మించలేదని తెలిపారు. ఆయన ఏఎస్‌ఐ తరపున కుతుబ్‌మినార్‌లో పలుమార్లు సర్వే చేశారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'ఇది కుతుబ్ మినార్ కాదు, సూర్య గోపురం (అబ్జర్వేటరీ టవర్) ఇది 5వ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య చేత నిర్మించారు. కుతుబ్ అల్-దిన్ ఐబక్ చేత నిర్మించలేదు. దీనికి సంబంధించి నా వద్ద చాలా ఆధారాలు ఉన్నాయి. కుతుబ్ మినార్ టవర్‌లో 25 అంగుళాల వంపు ఉంది. ఇది సూర్యుడిని గమనించడానికి రూపొందించారుకాబట్టి, జూన్ 21 న, అయనాంతం మారే మధ్య (ఉత్తరాయణం నుంచి దక్షిణాయణంలోకి మారే క్రమం) కనీసం అరగంట పాటు ఆ ప్రాంతంపై నీడ పడదు. ఇది సైన్స్.. పురావస్తు వాస్తవం` ని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'కుతుబ్ మినార్ అని పిలవబడేది ఒక స్వతంత్ర నిర్మాణం. అది సమీపంలోని మసీదుకు సంబంధించినది కాదు. కుతుబ్ మినార్ తలుపు కూడా ఉత్తరం వైపు ఉంది. అంటే రాత్రి ఆకాశంలో ధృవ నక్షత్రాన్ని చూసేందుకే` అని అన్నారు.