home page

ఆగస్టు తర్వాత కొత్త పార్టీ -ప్రశాంత్ కిషోర్

బీహార్లో కొత్త పాలన రావాలి:

త్వరలో పాదయాత్ర ప్రారంభిస్తా

 | 
Kcr prashanth kishore

దేశరాజకీయాలలో మార్పు అనేది అవసరం 

దేశవ్యాప్తంగా రాజకీయాల్లో మార్పు అవసరమని ప్రముఖ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం పడ్డారు. పాట్నా లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడు రాజకీయ పార్టీ ప్రకటన చేయడంలేదని ఆయన చెప్పారు. బీహార్లో సుపరిపాలన అందిస్తానని ఆయన చెప్పారు. దేశరాజకీయాలలో మార్పు అనేది అవసరం అయినప్పుడు అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆగస్టు తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.

గురువారం నాడు పాట్నాలో ఆయన మీడియా మీడియాతో మాట్లాడారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని గత మాసంలో ఆయన ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారని కూడా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.ఈ తరుణంలో ఆయన మీడియా సమావేశంలో కీలక విషయాలను ప్రకటించారు. ఈ ఏడాది గాంధీ జయంతి రోజు నుండి పాదయాత్రను ప్రారంభించనున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.

వచ్చే నెల 3,4 తేదీల్లో 17 వేల మందిని కలువనున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.సుపరిపాలనతో వారితో చర్చించనున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. వారు కలిసి వస్తే పార్టీని ప్రకటించినా కూడా అది ప్రశాంత్ కిషోర్ పార్టీ కాదన్నారు.బీహార్ రాష్ట్రంలో గుడ్ గవర్నెన్స్ తీసుకురావడానికి తాను పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన సుదీరథ రాజకీయ అనుభవాన్ని బీహార్ కోసం వినియోగిస్తానని ఆయన ప్రకటించారు.