home page

మదరసాలలో జాతీయ గీతం

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ ఆదేశాలు

 | 
Yogi madarsas

హిందుత్వ అజెండా అమలుకు సన్నాహాలు

ఉత్తర ప్రదేశ్ లోని అన్ని మదరసాలలో జాతీయ గీతాలాపన తప్పని సరిచేస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ ఆదేశాలు జారీ చేశారు. యోగీ పేరు చెబితే యూపీలో నేరస్తులకు హడల్. తప్పు చేస్తే.. నో ఎఫ్‌ఐఆర్, నో అరెస్ట్.. ఓన్లీ ఎన్‌కౌంటర్ అన్న రీతిలో వ్యవహరించడంతో నేరం చేయడానికి చాలా మంది వణికిపోయారు. యోగి అధికారంలోకి వచ్చాకా యూపీలో క్రైమ్ రేట్ బాగా తగ్గింది. ఇక బుల్డోజర్లతో తప్పు చేసిన వారి ఇళ్లు కూల్చి హడలెత్తించారు. బుల్డోజర్ బాబాగా ప్రాచుర్యం పొందారు. అయితే ఆదిత్యనాథ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా మసీదులకు కాషాయ రంగులు వేయించడం లాంటి చర్యలపై పెద్ద దుమారమే రేగింది. మైనారిటీల హక్కులను ఆదిత్యనాథ్ కాలరాస్తున్నారంటూ విపక్షాలు దుమ్మెత్తి పోశాయి. అయితే యోగి మాత్రం వెనక్కు తగ్గేదే లేదంటున్నారు.

తాజాగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మదర్సాలు అన్నింటిలో జాతీయ గీతం జనగణమణను తప్పని సరి చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో యూపీ మదర్సాల విద్యా బోర్డు రిజిస్ట్రార్ ఎస్‌.ఎన్‌ పాండే అన్ని జిల్లాల మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 24న జరిగిన బోర్డు సమావేశంలో మదర్సాల్లో జాతీయ గీతాన్ని తప్పని సరి చేస్తూ.. నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. మదర్సాల్లో తరగతులు మొదలయ్యే ముందు విద్యార్థులు, అధ్యాపకులు జాతీయ గీతాన్ని ఆలపించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన మదర్సాలు, ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ ఇస్లామిక్ విద్యాసంస్థల్లో ఈ నిర్ణయం అమలవుతుంది.

ఈ ఆదేశాలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. సాధారణంగా మదర్సాల్లో తరగతులు ప్రారంభానికి ముందు హమ్ద్, సలామ్ ఉచ్చరిస్తారు. కొన్ని చోట్ల జాతీయ గీతం పాడుతున్నా.. ఇప్పటివరకు తప్పని సరి కాదు. కానీ యూపీ సర్కార్ తాజా ఆదేశాలతో ఇకపై జనగణమణ పాడాల్సిందే. దేశభక్తి పెంచే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని యూపీ అధికారులు చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ధరమ్ పాల్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని మదర్సాల్లో దేశభక్తి బోధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం యూపీలో 16 వేల 461 మదర్సా

లు ఉన్నాయి. వీటిలో 560 మదర్సాలకు ప్రభుత్వ నిధులు అందుతున్నాయి. అయితే ఆదిత్యనాథ్ సర్కార్ తాజా నిర్ణయంపై ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి మరి.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సంచలనాలకు మారుపేరు. కాషాయ వస్త్రాలు ధరించి సాధు జీవనాన్ని అవలంభిస్తున్న యోగి అంటే..