home page

నేడు న్యాయాధికారుల సమావేశం:సిజెఐ , ప్రధాని

2016  తరవాత తొలిసారిగా సమావేశం

 | 
Cji with pm

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ నేతృత్వంలో న్యాయాధికారుల సమావేశం శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి ప్రసంగించనున్నారు. విజ్ఞాన్ భవన్ వేదికగా జరగనున్న ఈ సదస్సులో  అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొననున్నారు. సదస్సు అజెండాలో 6 ప్రధానాంశాలు ఉండనున్నాయి. ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభం కానుంది. న్యాయమూర్తుల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. తెలంగాణ తరపున సదస్సులో న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొననున్నారు.

ప్రస్తుతం దేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి..? అనే విషయంపై చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కానుంది.బాధితులకు సులభంగా, త్వరగా న్యాయం అందించే విధి విధానాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. నిన్న హైకోర్టుల సీజేల సదస్సు ఆరేళ్ల గ్యాప్‌ తర్వాత సీజేఐ ఎన్వీ రమణ చొరవతో జరిగింది. న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఆరేళ్ళ తరువాత ఈ భేటీ జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలాఉంటే.. బీహార్ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఈ రోజు జరిగే ముఖ్యమంత్రుల సమావేశానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.. రాష్ట్రంలో మిత్రపక్షమైన బీజేపీ తీరుపై నితీశ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటున్నారు.